AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా

మహిళ స్నానం చేస్తుండగా.. ఆమెకు ఎక్కడ నుంచో ఏదో ఫ్లాష్ కనిపించింది. ఏంటా అని పరిశీలించగా అదొక హిడెన్ కెమెరా.. దీంతో యూనివర్సిటీ అంతటా ఒక్కసారిగా అలెర్ట్ అయింది. ఇది చిత్తూరులో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చూసేయండి.

Andhra: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా
Andhra Pradesh
Raju M P R
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 10, 2025 | 1:33 PM

Share

చిత్తూరులోని అపోలో యూనివర్సిటీ గర్ల్స్ బ్లాక్‌లో హేయమైన ఘటన బయటపడింది. గర్ల్స్ టాయిలెట్లలో హిడెన్ కెమెరా స్టూడెంట్ కంటపడటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. హిడెన్ కెమెరా వ్యవహారం యూనివర్సిటీలో కలకలం రేపింది. విషయం పేరెంట్స్ దాకా చేరడంతో చర్చగా మారింది. ఇలాంటి పనికి పాల్పడిన నీచుడు యూనివర్సిటీలో జరుగుతున్న నిర్మాణ పనులు పర్యవేక్షించే సైట్ ఇంజినీర్‌గా తేలింది. కన్స్ట్రక్షన్స్ సైట్ ఇంజనీర్ రూబెన్‌గా గుర్తించిన యూనివర్సిటీ యాజమాన్యం.. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన చిత్తూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలాగే చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఇది చదవండి: చిత్తు కాగితాలు అనుకునేరు.. 30 ఏళ్ల క్రితం రూ. వెయ్యి.. ఇప్పుడు రూ. 1.83 కోట్లు

టాయిలెట్‌లో ఏర్పాటు చేసిన కెమెరాలో రికార్డింగ్‌లపై ఆరా తీశారు. ఎలాంటి వీడియో రికార్డింగ్స్ లేవని తేల్చిన పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. నిందితుడు తమిళనాడు రాజుపాలెం లింగాపురంకు చెందినవాడుగా గుర్తించారు. యూనివర్సిటీలో జరుగుతున్న భవన నిర్మాణ పనులను హరినారాయణ కన్స్ట్రక్షన్‌కు అపోలో యాజమాన్యం అప్పగించగా.. సైట్ ఇంజనీర్‌గా పని చేస్తున్న కంద రూబెన్ వక్రబుద్ధి ప్రదర్శించాడు. స్టూడెంట్స్ టాయిలెట్స్‌లో కెమెరా పెట్టి వీడియోలు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు నిందితుడి వద్ద నుంచి సెల్ ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సెల్‌ఫోన్‌లో వీడియోలు డిలీట్ కావడంతో టెక్నికల్ రికవరీకి పంపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. నిందితున్ని ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు మీడియా ముందు అరెస్టు చూపే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: పాత బంగారాన్ని ఇచ్చి కమ్మలు కొంటానంది.. కట్ చేస్తే.. తను ఏం చేసిందంటే

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..