Viral Video: ఇంత ఉందేంటి భయ్యా.! చేపల వలకు చిక్కిన అదో మాదిరి ఆకారం.. ఏంటని చూడగా
సముద్రంలో వల వేసిన జాలర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తమ వలకు చిక్కింది దాన్ని చూసి స్టన్ అయ్యారు. అయ్యబాబోయ్.! ఇంత ఉందేంటి అని అనుకున్నారు. దెబ్బకు దాన్ని పడవకు కట్టి బంధించారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

సరీసృపాలలో అనకొండలు చాలా డేంజరస్. అవి ఏ జంతువునైనా.. అలాగే మనిషైనా అమాంతం మింగేయగలవు. పరిమాణం.. అలాగే బరువులోనూ భారీగా ఉండే వీటిని మనం చాలా అరుదుగా చూస్తుంటాం. అయితే ఆఫ్రికాలో వీటి మూలాలు ఎక్కువే. ఆఫ్రికన్ ఫారెస్టుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ జాతికి చెందిన ఓ కొండచిలువ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇది చదవండి: రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు
వైరల్ వీడియో ప్రకారం.. ఓ పడవపై భారీ సైజ్ అనకొండ కట్టేసి ఉండటం మీరు చూడవచ్చు. అది నార్తర్న్ గ్రీన్ అనకొండ జాతికి చెందింది. ఇది చాలా అరుదు. ఈ జాతికి చెందిన అనకొండలు ఆకారంతో పాటు పొడువులో కూడా భారీగా ఉంటాయి. ‘అనా జూలియా’ అనే ఈ నార్తర్న్ గ్రీన్ అనకొండ 20.7 అడుగులు(6.3 మీటర్లు) పొడవు, 440 పౌండ్లు (200 కిలోలు) బరువు ఉంటుంది. ఈ జాతికి చెందిన ఇంకా పొడవైన అనకొండలు కూడా ఉంటాయట. అవి సుమారు 24 అడుగుల(7.5 మీటర్లు) కంటే ఎక్కువ పొడవు, 1,100 పౌండ్లు (500 కిలోలు) బరువు కలిగి ఉండవచ్చని అంచనా. కాగా, ఈ వీడియో క్షణాల్లో నెట్టింట వైరల్ కాగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. కొందరు అమ్మబాబోయ్..! అంత పొడవా అంటూ ఆశ్చర్యపోతే.. మరికొందరు ఇదంతా ఏఐ అని.. ఫేక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇది చదవండి: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా
View this post on Instagram




