AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. ఎమ్మిగనూరు సభలో ప్రసంగించనున్న బాబు..

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా,ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముందుగా 11.30 గంటలకు హెలిపాడ్ వద్ద చేరుకున్న చంద్రబాబుకు ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి, నాయకులు ఘన స్వాగతం పలికారు.

కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. ఎమ్మిగనూరు సభలో ప్రసంగించనున్న బాబు..
Chandrababu Naidu
J Y Nagi Reddy
| Edited By: Srikar T|

Updated on: Mar 31, 2024 | 2:19 PM

Share

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా,ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముందుగా 11.30 గంటలకు హెలిపాడ్ వద్ద చేరుకున్న చంద్రబాబుకు ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి, నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి రోడ్ షోగా బయలుదేరి అన్నమయ్య సర్కిల్, శివ సర్కిల్, సోమప్ప సర్కిల్, శ్రీనివాస సర్కిల్,మీదుగా తెరుబజార్‎లో ఏర్పాటుచేసిన ప్రజాగళం బహిరంగ సభకు చంద్రబాబు చేరుకోనున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా నేతలు సభకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. చంద్రబాబు రాకతో ఎమ్మిగనూరు పట్టణం మొత్తం పసుపు మయమైంది. కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తు, తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో వివరించనున్నారు.

ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రస్తుత పాలనపై దుమ్మెత్తి పోశారు. తాను అధికారంలోకి వస్తే జగన్ కంటే మంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మే బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. ఇలా జగన్ ముందుగా పర్యటించిన ప్రాంతాల్లో ప్రజాగళం పేరుతో యాత్ర చేస్తూ  ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. రానున్న రోజుల్లో అటు టీడీపీ, ఇటు అధికార వైసీపీ ప్రచారాన్ని ఉధృతం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సిద్దం పేరుతో 4 భారీ బహిరంగ సభలను నిర్వహించిన సీఎం జగన్ మేమంతా సిద్దం అంటూ బస్సు యాత్ర చేపట్టారు. ఈ రెండు యాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో రాయలసీమలో ఎండలకంటే ఎక్కువగా రాజకీయాలు వేడెక్కాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..