Rajampeta Politics: ఎంట్రీతోనే వైసీపీ టార్గెట్.. అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చిన వైసీపీ.. రాజంపేటలో పొలిటికల్ హీట్
ఏపీ ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. రాజంపేట బరిలో ఇద్దరు వారసుల మధ్య పోరు.. ఒకరు మాజీ ముఖ్యమంత్రి, మరొకరు వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన నేత. అవును.. ఇద్దరు నేతల మధ్య విమర్శల పర్వం రాజంపేట పాలిటిక్స్‌లో హీట్ పెంచుతోంది.
ఏపీ ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. రాజంపేట బరిలో ఇద్దరు వారసుల మధ్య పోరు.. ఒకరు మాజీ ముఖ్యమంత్రి, మరొకరు వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన నేత. అవును.. ఇద్దరు నేతల మధ్య విమర్శల పర్వం రాజంపేట పాలిటిక్స్‌లో హీట్ పెంచుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆసక్తికర పోరు జరగబోతోంది. కూటమి అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, వైసీపీ నుంచి క్యాండేట్‌గా సిట్టింగ్ ఎంపీ మిథున్‌రెడ్డి బరిలో దిగుతున్నారు. ఈ క్రమంలోనే.. ఇరువురు నేతలు ప్రచారం ప్రారంభించారు. కూటమి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాక అన్నమయ్య జిల్లా కలికిరి మండలం నగిరిపల్లిలో తొలిసారి పర్యటించారు కిరణ్‌కుమార్‌రెడ్డి. ఈ సందర్భంగా.. వైసీపీ టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించారు. రాజంపేట, పుంగనూరుకు పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేసిందేమీలేదన్నారు కిరణ్‌కుమార్‌రెడ్డి. రాజకీయాన్ని డబ్బు సంపాదించడం కోసమే వాడుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని మోసం చేసి, ప్రజాధనాన్ని లూటీ చేశారని మండిపడ్డారు. ఐదేళ్లలో ఏపీ ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని.. అప్పు చేయకుంటే ప్రస్తుతం జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని విమర్శించారు కిరణ్‌కుమార్‌రెడ్డి.
ఇక, పుంగనూరు, రాజంపేట అభివృద్ధి చెందాయంటే అది పెద్దిరెడ్డి, సీఎం జగన్ చలువే అంటూ కిరణ్‌కుమార్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. చిత్తూరు జిల్లా పుంగనూరు వైసీపీ సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఒకాయన సూట్‌కేస్‌తో ఎంపీగా పోటీ చేయడానికి వచ్చారంటూ కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి కామెంట్ చేశారు. జూన్ నాలుగు తర్వాత మళ్లీ అదే సూటుకేసుతో తిరిగి వెళ్లేలా ప్రజలు తీర్పు ఇస్తారన్నారు. ఇక.. మదనపల్లి, పుంగనూరు, పీలేరులో ముస్లిం ప్రజలు ఎక్కువ అని.. ఇలాంటి పరిస్థితుల్లో.. కూటమికి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని గుర్తుంచుకోవాలని సూచించారు.
మొత్తంగా.. రాజంపేట రాజకీయం రసవత్తరంగా మారుతోంది. కూటమి అండతో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి.. రెండుసార్లు వరుసగా గెలిచిన ధైర్యంతో మిథున్‌రెడ్డి ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. అయితే.. ఫస్ట్ ఎంట్రీతోనే కిరణ్‌కుమార్‌రెడ్డి వైసీపీని టార్గెట్ చేయగా.. అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చి కాక రేపారు మిథున్‌రెడ్డి. ఈ నేపథ్యంలో.. కూటమి, వైసీపీ నేతల మధ్య రాజంపేట ప్రచారహోరు రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి..!