YS Jagan: సీఎం జగన్ ఫుల్ ఫోకస్.. సంజీవపురం నుంచి తిరిగి ప్రారంభం కానున్న బస్సు యాత్ర..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా.. మేమంతా సిద్ధం యాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు. క్రైస్తవుల పర్వదినం ఈస్టర్ కావడంతో ఈరోజు ప్రచారానికి బ్రేక్ వేశారు. బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చిన సీఎం జగన్...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా.. మేమంతా సిద్ధం యాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు. క్రైస్తవుల పర్వదినం ఈస్టర్ కావడంతో ఈరోజు ప్రచారానికి బ్రేక్ వేశారు. బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చిన సీఎం జగన్… అనంతపురం జిల్లాలోనే ఈస్టర్‌ను జరుపుకోనున్నారు. ధర్మవరం నియోజకవర్గంలోని సంజీవపురంలో కుటుంబ సభ్యులతో కలిసి ఈస్టర్ వేడుకల్లో పాల్గొననున్నారు. దీంతో పాటు సీఎం జగన్ ఇవాళ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం జగన్ వారికి పలు సూచనలు ఇవ్వనున్నారు. కాగా.. మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపు సంజీవపురం నుంచి తిరిగి ప్రారంభంకానుంది.
నిన్న అనంతపురం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్రకు జనం నీరాజనం పట్టారు. గుత్తి మొత్తంగా జనసంద్రంగా మారింది. భారీ జన సందోహం, పూలవర్షం మధ్య సీఎం జగన్ రోడ్‌షో సాగింది. తపోవనం, గుత్తి, పామిడి సహా అన్ని ప్రాంతాల్లో జగన్ బస్సు యాత్రకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..