YS Jagan: స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.. తుగ్గలి గ్రామస్తులతో సీఎం జగన్‌ ముఖాముఖి..

సీఎం జగన్‌మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. కర్నూలు జిల్లా రాతన నుంచి మొదలైన సీఎం జగన్ బస్సుయాత్ర రాత్రికి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. బస్సు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గలి ప్రజలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. 58 నెలల్లో గ్రామాల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయన్నారు.

Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 30, 2024 | 2:16 PM

సీఎం జగన్‌మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. కర్నూలు జిల్లా రాతన నుంచి మొదలైన సీఎం జగన్ బస్సుయాత్ర రాత్రికి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. బస్సు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గలి ప్రజలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. 58 నెలల్లో గ్రామాల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ రకమైన కార్యక్రమాలు జరగలేదన్నారు. తుగ్గలి గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని జగన్ తెలిపారు. మనకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు రాజ్యమేలాయన్నారు. తుగ్గలి అభివృద్ధి, సంక్షేమం కోసం రూ. 29.65 కోట్లు ఇచ్చామని.. రాతన గ్రామంలో 95 శాతం కుటుంబాలకు లబ్ది జరిగిందని సీఎం జగన్ పేర్కొన్నారు.

తుగ్గలిలో ముఖాముఖి అనంతరం సీఎం జగన్.. తర్వాత గరిగెట్ల క్రాస్‌ మీదుగా జొన్నగిరి, బసినేపల్లి, గుత్తి, పామిడి, గార్లదిన్నె, రాప్తాడు, ఇటికలపల్లి మీదుగా క్రిష్ణంరెడ్డిపల్లి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు సీఎం జగన్‌..

కాసేపట్లో అనంతపురం జిల్లాలో ప్రవేశించనుంది సీఎం జగన్ బస్సు యాత్ర. నిన్న కర్నూలు జిల్లాలో సాగిన యాత్రలో జనం అడుగడుగునా నీరాజనం పట్టారు. ఎమ్మిగనూరు సభకు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పోటెత్తారు. పెంచికలపాడు నుంచి రాతన వరకు భారీ స్వాగతం లభించింది. ఎక్కడికక్కడ పూలవర్షం కురిపిస్తూ సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం పలికారు జనం.