AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP: చంద్రబాబుపై లారీ డ్రైవర్ల ఆగ్రహం.. ఎమ్మిగనూరులో దిష్టిబొమ్మ దగ్ధం..

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగనమల నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వీరాంజనేయులును టిప్పర్ డ్రైవర్ అంటూ కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.

J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Mar 31, 2024 | 8:02 PM

Share

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగనమల నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వీరాంజనేయులును టిప్పర్ డ్రైవర్ అంటూ కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. దీనిని నిరసిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లారీ డ్రైవర్లు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే టికెట్ టిప్పర్ డ్రైవర్‎కి కేటాయిస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని లారీ డ్రైవర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం లారీ డ్రైవర్లు మాట్లాడుతూ గతంలో టీ అమ్ముకునే వ్యక్తి ఈరోజు దేశ ప్రధాని కాలేదా, అలాంటిది టిప్పర్ డ్రైవరు ఎమ్మెల్యే అయితే తప్పా అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు హయంలో ఉన్నతమైన చదువులు చదివినా ఉద్యోగం రాకపోవడంతోనే రామాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అయ్యాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తి గురించి టిప్పర్ డ్రైవర్ అని హేళన చేస్తూ మాట్లాడడం మంచిది కాదు అన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో తమ లారీ డ్రైవర్ల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌
రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌