Cyber Fraud: ఉగ్రవాదులకు ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారంటూ కాల్.. కట్ చేస్తే రూ. 20 లక్షలు హాంపట్..!

టెక్నాలజీ అప్‌డేట్ అయినట్లే.. సైబర్ క్రిమినల్స్ కూడా దానికి మించిన రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. రోజుకో స్టైల్లో.. కొత్త కొత్త స్ట్రాటజీలతో అమాయకులను నిలువునా ముంచేస్తున్నారు. అయితే.. తెలియకుండా మోసాలు చేయడం కామన్.. కానీ.. ఇప్పుడు.. చెప్పి మరీ మోసాలకు పాల్పడుతుండడం షాకిస్తోంది.

Cyber Fraud: ఉగ్రవాదులకు ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారంటూ కాల్.. కట్ చేస్తే రూ. 20 లక్షలు హాంపట్..!
Cyber Crime
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Mar 31, 2024 | 12:41 PM

టెక్నాలజీ అప్‌డేట్ అయినట్లే.. సైబర్ క్రిమినల్స్ కూడా దానికి మించిన రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. రోజుకో స్టైల్లో.. కొత్త కొత్త స్ట్రాటజీలతో అమాయకులను నిలువునా ముంచేస్తున్నారు. అయితే.. తెలియకుండా మోసాలు చేయడం కామన్.. కానీ.. ఇప్పుడు.. చెప్పి మరీ మోసాలకు పాల్పడుతుండడం షాకిస్తోంది. మోసం చేసేది విదేశాల నుంచైనా.. మోసపోతోంది మాత్రం మనోళ్లే.

‘హలో మేము ఫెడెక్స్ కొరియర్ నుంచి కాల్ చేస్తున్నాం.. మీ పేరుతో ముంబై నుంచి తైవాన్ కు ఓ పార్సెల్ బుక్ అయింది.. అందులో నిషేధిత డ్రగ్స్ ఉన్నాయి. ఫేక్ పాస్‌పోర్ట్ క్రెడిట్ కార్డులు కూడా ఉన్నట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. మీ పేరు ఫోన్ నెంబర్ ఇదే కదా.. ఆ పార్సెల్‌కు సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. నార్కోటిక్ పోలీసులు లైన్‌లోకి వస్తారు.’ ఆ వెంటనే మరో వ్యక్తి లైన్ లోకి వచ్చాడు. ‘విచారణ కోసం ముంబై రావాల్సి ఉంటుంది. ఏదైనా ఉంటే పై అధికారులతో మాట్లాడుకోండి. ఆన్‌లైన్‌లో లాగిన్ అవ్వాలని స్కైప్ ఐడి ఇచ్చారు.

భయంతో కనెక్ట్ కాగానే వీడియో కాల్ లో తాము అడిగిన వివరాలు ఇవ్వాలని సూచించారు. ఆ విషయాలను ఎవరికీ చెప్పకూడదని ఒక రాత్రి అంతా అతన్ని మాటల్లో పెట్టారు. అనేక విషయాలు చర్చించి మీకు వ్యక్తిగత ఖాతా నుంచి ఉగ్రవాదులకు నగదు ట్రాన్స్‌ఫర్ అయింది. ఆర్‌బీఐ నిబంధన ప్రకారం విచారణ చేయాల్సి ఉంటుంది. అందుకు ఆ ఎకౌంటు నుంచి నగదు ట్రాన్స్‌ఫర్ చేయండి.. లేకుంటే కేసుల్లో ఇరుక్కోక తప్పదు. అనగానే భయపడి వారి మాటల్లో పడి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 లక్షలు.. స్వాహా చేశారు.

సైబర్ కేటుగాళ్లు తమ మోసాలకు అవసరమైన అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఒక్కొక్కరికి ఎరవేస్తూ.. వాళ్ల మాటల్లో పడి కాస్త కమిట్ అయిన వాళ్ళకి నిలువునా ముంచేస్తున్నారు. తాజాగా విశాఖకు చెందిన ఓ వ్యక్తికి వారం రోజుల క్రితం ఓ ఫోన్ కాల్ వచ్చింది. తెలియని నెంబర్ కావడంతో ఎవరో అనుకొని లిఫ్ట్ చేశాడు. హలో అనగానే.. తాను ముంబైలోని ఫెడెక్స్ కొరియర్ సర్వీస్‌కు చెందిన ప్రతినిధి అని చెప్పుకొచ్చాడు. ముంబై నుంచి తైవాన్ కు ఓ పార్సల్ బుక్ అయిందని.. మీ పేరు మీదే అది ఉందని.. అందులో నిషేధిత డ్రగ్స్ తో పాటు, నకిలీ పాస్‌పోర్టులో క్రెడిట్ కార్డులు బ్యాంకు పాస్‌బుక్.. ఎండిఎంఏ పౌడర్ ఉందంటూ.. కస్టమ్స్ అధికారులు గుర్తించినట్టు చెప్పుకొచ్చాడు.

దీంతో అవాక్కైన బాధితుడు.. తాను ఏ పార్సెల్ కూడా బుక్ చేయలేదని బదులిచ్చాడు. ఆ వెంటనే అవతల వ్యక్తి.. మాటల్లో పెట్టి బాధితుడు వ్యక్తిగత వివరాలతో పాటు ఫోన్ నెంబర్ అడ్రస్ చెప్పుకొచ్చాడు. తన వివరాలను చెప్పేసరికి ఒక్కసారిగా అవాక్కయ్యాడు బాధితుడు. అంతేకాదు పార్సెల్ లో గుర్తించిన వస్తువుల ఆధారంగా.. ఎఫ్ఐఆర్ కూడా నమోదయిందని ఆ నెంబర్ కూడా చెప్పాడు. నార్కోటిక్ అధికారులకు కాల్ బదిలీ చేస్తున్నామంటూ బెదిరించాడు. వెంటనే మరో వ్యక్తి లైన్ లోకి వచ్చి.. కేసు వివరాలు చెబుతూ నమ్మించే ప్రయత్నం చేశాడు. విచారణ కోసం వెంటనే ముంబై రావాలని సూచించాడు. దీంతో తాను చేయని తప్పుకు తానెల రాగలనని మదన పడుతూ.. అంత దూరం రాలేనని బాధితుడు బదులు ఇచ్చాడు. దీంతో కచ్చితంగా విచారణకు రావాల్సిందేన అంటూ ఏదైనా ఉంటే పై ఆఫీసర్లతో మాట్లాడాలని చెబుతూ ఒత్తిడి చేశాడు.

అంత దూరం రాలేకపోతే వీడియో కాల్‌లో అయినా విచారణకు హాజరు కావాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మేటర్ అని చెబుతూనే.. వీడియో కాల్ లాగిన్ కోసం ఒక స్కైప్ ఐడి ఇచ్చారు. అందులో లాగిన్ అయి తమతో వీడియో కాల్ మాట్లాడాలని ఆదేశాలు జారీ చేశారు. ఒంటరిగానే ఎవరికీ చెప్పకుండా తమతో మాట్లాడాల్సి వస్తుందని ఈ విషయాలేవీ బయటకు చెప్పకూడదంటూ షరతు కూడా పెట్టారు. ఒంటరిగా నైట్ కాల్ చేయాలని చెబుతూ.. ఒకరోజు రాత్రంతా విచారణ పేరుతో మాటల్లో పెట్టారు. అనేక విషయాలు మాట్లాడి భయాందోళన గురి చేశారు.

అంతేకాదు.. మీ అకౌంట్ నుంచి ఉగ్రవాదుల ఎకౌంటులకు మనీ ట్రాన్స్‌ఫర్ అయింది అంటూ బెదిరించారు. ఆర్‌బీఐ గైడ్లైన్స్ ప్రకారం విచారణ చేయాల్సి ఉంటుందని.. అందుకు బ్యాంకు ఖాతా ద్వారా తమకు కొంత అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలని.. సూచించారు. అందుకోసం ఆర్‌బీఐ ద్వారా పంపినట్టు ఓ నకిలీ డాక్యుమెంట్ కూడా పంపించారు. అలా మాటల్లో పెట్టి దఫ దఫాలుగా రూ. 20 లక్షల వరకు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత ఆలస్యంగా తాను మోసపోయానని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు.

కూపి లాగితే లింకు రాజస్థాన్‌కు..

బాధితుడు ఇచ్చిన ఫిర్యాదులతో విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్.. సమగ్ర విచారణకు ఆదేశించారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీఐ భవాని శంకర్ నేతృత్వంలో ఒక బృందం బాధితుడు లాగిన్ అయిన స్కైప్ ఐడీల ఆధారంగా.. నగదు పంపిన ఎకౌంటు వివరాల ఆధారంగా ట్రాక్ చేశారు. దీంతో లింకు రాజస్థాన్‌కు తగిలింది. అక్కడికి వెళ్లిన ప్రత్యేక బృందం ఈ మోసానికి పాల్పడిన కమలేష్, శ్రవణ్, సీతారాం, అభిషేక్, జకర్ లను గుర్తించి అరెస్టు చేశారు. నిందితులు వినియోగించిన మొబైల్ ఫోన్లు బ్యాంక్ అకౌంట్ ను సీజ్ చేశారు.

రాజస్థాన్ కోటలో నిందితులను హాజరపరిచి.. ట్రాన్సిట్ వారెండుపై విశాఖకు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు కోసం గాలిస్తున్నామని ప్రకటన జారీ చేశారు పోలీసులు. తెలియని నెంబర్ తో కాల్ వచ్చిన.. చేయని తప్పు కోసం ఎవరైనా ప్రశ్నించిన స్పందించ వద్దని సూచిస్తున్నారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..