AP Rain Alert: మరో అల్పపీడనం.. ఏపీలో విస్తారంగా వర్షాలు.. ఎప్పటినుంచంటే.?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఈ నెల 12వ తేదీన కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల మధ్య బంగాళాఖాతంలో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఈ నెల 12వ తేదీన కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఈ నెల 13 నుంచి రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఇదిలా ఉంటే ఉత్తర ఈశాన్య తెలంగాణ, ఉభయగోదావరి జిల్లాల మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడటంతో సోమవారం ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మరోవైపు మధ్య భారతదేశంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రాంతం కారణంగా రాష్ట్రంలో పొడిగాలులు ప్రభావం ఎక్కువగా ఉందని.. అది బలహీనపడే వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
కాగా, గడిచిన 24 గంటల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. నూజివీడులో అత్యధికంగా 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా కంచికచర్లలో 30.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Read Also: నీళ్లు తాగుతున్న ఏనుగుపై మొసలి దాడి చేసింది.. గజరాజుకు కోపమొచ్చింది.. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా..
సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!
అమ్మాయి టిక్ టాక్ వీడియో చేస్తోంది..! అప్పుడే వాళ్ల అమ్మ వచ్చింది..? ఏం జరిగిందంటే..
భారత్ వెయిట్ లిఫ్టర్లకు షాక్.. ఒలింపిక్స్ కమిటీ సంచలన నిర్ణయం..