AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dating App: ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఇచ్చే డీల్స్‌పై భారతీయులు భయపడుతున్నారు.. సర్వేలో తేలిన నమ్మలేని నిజాలు..

Online Dating Apps: మ్యాట్రిమొనీ యాప్స్, డేటింగ్ యాప్స్ వంటి వాటికి చాలామంది దూరంగా ఉంటారు. అయితే ప్రస్తుతం ఇంతకు ముందెన్నడు లేని విధంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. అయినా భారతీయులు మాత్రం నో అంటున్నారు..

Dating App: ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఇచ్చే డీల్స్‌పై భారతీయులు భయపడుతున్నారు.. సర్వేలో తేలిన నమ్మలేని నిజాలు..
Dating App
Sanjay Kasula
|

Updated on: Aug 09, 2021 | 7:54 AM

Share

మ్యాట్రిమొనీ యాప్స్, డేటింగ్ యాప్స్ వంటి వాటికి చాలామంది దూరంగా ఉంటారు. అయితే ప్రస్తుతం ఇంతకు ముందెన్నడు లేని విధంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ఈ క్రమంలో కలల జీవిత భాగస్వామిని కనుగొనడానికి ఇప్పుడు డేటింగ్ యాప్స్ సైతం సాయం చేస్తున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది అతి ముఖ్యమైన ఘట్టం. ఒక రకంగా చెప్పాలంటే పెళ్లితో మనిషి జీవితం మరో మలుపు తీసుకుంటుంది. అప్పటి వరకు పెరిగిన ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. జీవితాంతం తోడుండే భాగస్వామిని పొందడం అంత సులభం కాదు. అయితే వివరాలిలా.. డేటింగ్ యాప్ ఉపయోగించి తమకు భాగస్వామిని కనుగొన్న కొంతమంది మన చుట్టూ కనిపిస్తుంటారు. ఈ యాప్ అనుభవం కొంతమందికి మంచిది కానీ కొంతమందికి చెడును చేస్తుంది.. అంతేకాదు వారికి భారీ  ఆర్ధిక మోసానికి గురవుతుంటారు. డేటింగ్ యాప్ ద్వారా డీల్ చేసుకునేందుకు భారతీయులు నో అంటున్నారు.

ఈ సందర్భంలో కాస్పర్‌స్కీ గ్లోబల్ సర్వే నిర్వహించింది. దీనిలో కంపెనీ డేటింగ్ యాప్‌లు.. వారి అనుభవాల గురించి ప్రజలను అడిగింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం చాలా మంది వ్యక్తులు అలాంటి యాప్‌ను ఉపయోగించరు. ఎందుకంటే వారు స్కామర్‌లకు భయపడతారు. వీరిలో 34 శాతం మంది భారతీయులు డేటింగ్ యాప్‌లకు భయపడుతున్నారని వారు జరిపిన సర్వేలో తేలింది. ఎందుకంటే తాము మోసపోతామని భయపడుతున్నారని తమ పరిశీలనలో పేర్కొంది. డేటింగ్ యాప్‌లలో కలిసే వ్యక్తులను విశ్వసించడం లేదని 43 శాతం మంది చెప్పారు. 27 శాతం మంది సైబర్ నేరగాళ్లు తమను టార్గెట్ చేశారని 36శాతం మంది స్కామర్ల ద్వారా సంప్రదించబడ్డారని అయితే హ్యాక్ చేయకుండా తప్పించుకున్నారని చెప్పుకొచ్చారు.

డేటింగ్ యాప్‌లలో ప్రజలు ఎదుర్కొంటున్న మోసాలలో 33 శాతం క్యాట్‌ఫిషింగ్, 38 శాతం హానికరమైన లింక్‌లు లేదా అటాచ్‌మెంట్‌లు , 36 శాతం డేటా దొంగతనం జరిగిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. వీటితోపాటు అదనంగా 42 శాతం మంది దాడి నుండి తప్పించుకుని అనుమానాస్పద ప్రొఫైల్‌ను గుర్తించారు. 48 శాతం మంది డేటింగ్ యాప్‌లకు డబ్బు పంపలేదు. 37 శాతం మంది అనుమానాస్పద సందేశాలపై దృష్టి పెట్టలేదు. సర్వే చేసిన వారిలో ఇరవై తొమ్మిది శాతం మంది స్కామర్లు వీడియో కాల్ చేయడానికి నిరాకరించారు. వారు అనుమానాస్పదంగా మారారని వారు మోసపోయారని తెలుసుకున్నారని చెప్పారు.

గోప్యత విషయానికి వస్తే డేటింగ్ యాప్‌లతో పెద్ద సమస్య ఉంది. 26 శాతం మంది తమ వ్యక్తిగత డేటా ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతారని భయపడుతున్నారని చెప్పారు. 24 శాతం మంది తమ వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్‌గా ఉంచాలనుకుంటున్నందున డేటింగ్ యాప్‌లను తొలగిస్తున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి: Journalist Murder: గుట్కా మాఫియా చేతిలో జర్నలిస్టు కేశవ దారుణ హత్య.. కర్నూలు జిల్లాలో దారుణం..

Weight Loss Tips : కొవ్వు కరిగించేందుకు కష్టపడుతున్నారా.. ఇలా చేస్తే అద్భుత ఫలితం