Journalist Murder: గుట్కా మాఫియా చేతిలో జర్నలిస్టు కేశవ దారుణ హత్య.. కర్నూలు జిల్లాలో దారుణం..
తమ అక్రమాలకు, దురాగతాలకు వెలికి తీస్తున్నాడనే అక్కసుతో స్థానికంగా అరాచకాలను సృష్టిస్తున్న ఓ గుట్కా మాఫియా.. జర్నలిస్టును అత్యంత కిరాకతంగా హత్య చేసింది. ఏదైనా దాని మీద వారి నీడ ఉండాల్సిందే. ప్రజలకు ఇదేం..
తమ అక్రమాలకు, దురాగతాలకు వెలికి తీస్తున్నాడనే అక్కసుతో స్థానికంగా అరాచకాలను సృష్టిస్తున్న ఓ గుట్కా మాఫియా.. జర్నలిస్టును అత్యంత కిరాకతంగా హత్య చేసింది. ఏదైనా దాని మీద వారి నీడ ఉండాల్సిందే. ప్రజలకు ఇదేం దారుణం అని అడిగే ధైర్యం లేదు. ఇంకే ఆ దుండగుల ఆగడాలకు అంతే లేదు. కానీ ఒక జర్నలిస్టు వారి అక్రమాలను వెలికితీశాడు. ఆ ముఠా సాగిస్తున్న అక్రమ కార్యకలాపాలన్నింటికీ రుజువులు తీసుకొచ్చి టీవీలో ప్రసారం చేయించాడు. కానీ ఆ తెగువే అతడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. అసలేం జరిగింది..? కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ జర్నలిస్ట్ హత్యకు గురయ్యాడు. కత్తులతో దాడి చేసి జర్నలిస్ట్ కేశవను హత్య చేశారు దుండగులు. కేశవ ఓ యూట్యూబ్ ఛానల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల సస్పెండ్ అయిన కానిస్టేబుల్ హత్య చేయించాడని కేశవ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకెళ్తే… కర్నూలు జిల్లాలో జర్నలిస్టు దారుణ హత్యకు గురవడం సంచలనంగా మారింది. నంద్యాలలో ఓ యూట్యూబ్ ఛానల్‌లో కేశవ పని చేస్తున్నాడు. నంద్యాలకు చెందిన కానిస్టేబుల్ సుబ్బయ్య దురాగతాల పై తన యూట్యూబ్ ఛానల్ లో వార్త రాశాడు. దీని ఆధారంగానే తనను ఇటీవల ఎస్పి సస్పెండ్ చేశారని కక్ష కట్టాడు అని కేశవ ఫ్రెండ్స్ ఆరోపిస్తున్నారు.
ఇందులోభాగంగానే ఎన్జీవో కాలనీ లో హాస్టల్ దగ్గర ఉండగా కానిస్టేబుల్ సుబ్బయ్య అతని సోదరుడు నాని ఇద్దరు వచ్చి స్క్రూ డ్రైవర్ తో కడుపులో పొడిచి గాయపరిచి పారిపోయారని కేశవ ఫ్రెండ్ ఆరోపిస్తున్నాడు. తీవ్రంగా గాయపడిన రక్తస్రావం అయిన కేశవను ఆస్పత్రికి తరలించగా కాసేపటికే మృతిచెందినట్లు అతని సన్నిహితులు ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.
నంద్యాలలో హత్యకు గురైన విలేఖరి కేశవ మృతదేహాన్ని, హత్య కాబడిన సంఘటన స్థలంను ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి పరిశీలించారు. పరారిలో ఉన్న నిందితుల కోసం రెండు టీంలతో కలిసి గాలిస్తున్నట్లుగా తెలిపారు. విలేఖరి హత్యకు కానిస్టేబుల్ వెంకట సుబ్బయ్య, అతని తమ్ముడు నాని ప్రమేయం ఉన్నట్లుగా మృతుడి బంధువులు ఫిర్యాదు చేశారు.
ప్రత్యక్ష సాక్షి కథనం మేరకు మాట్లడటానికి పిలిచి ఆ ఇద్దరు వ్యక్తులు వెటాడి స్కూడ్రైవర్ తో పొడిచి హత్య చేశారని వెల్లడించారు. గతంలో మృతుడు కేశవ కానిస్టేబుల్ వెంకటసుబ్బయ్య గుట్కా వ్యాపారస్తులతో సత్సంబంధాలు నిర్వహిస్తూన్న అడియో వైరల్ చేశాడు. అ కారణంగానే సస్పెండ్ అయిన వెంకట సుబ్బయ్య విలేఖరి కేశవను హత్యచేసినట్లు తెలుస్తూంది.
ఇవి కూడా చదవండి: Corona Medicine: కరోనాపై ఆ మందు కూడా సమర్ధంగా పనిచేస్తుంది.. వెల్లడించిన పరిశోధకులు!
Weight Loss Tips : కొవ్వు కరిగించేందుకు కష్టపడుతున్నారా.. ఇలా చేస్తే అద్భుత ఫలితం