AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Medicine: కరోనాపై ఆ మందు కూడా సమర్ధంగా పనిచేస్తుంది.. వెల్లడించిన పరిశోధకులు!

కొలెస్ట్రాల్-తగ్గించే  ఔషధం ఫెనోఫైబ్రేట్, కరోనా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని 70 శాతం వరకు తగ్గిస్తుంది. యూకేలోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ ఇటీవలి పరిశోధనలో ఈ వాదన చేశారు.

Corona Medicine: కరోనాపై ఆ మందు కూడా సమర్ధంగా పనిచేస్తుంది.. వెల్లడించిన పరిశోధకులు!
Corona Medicine
KVD Varma
|

Updated on: Aug 08, 2021 | 9:25 PM

Share

Corona Medicine: కొలెస్ట్రాల్-తగ్గించే  ఔషధం ఫెనోఫైబ్రేట్, కరోనా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని 70 శాతం వరకు తగ్గిస్తుంది. యూకేలోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ ఇటీవలి పరిశోధనలో ఈ వాదన చేశారు. ఈ ఔషధంలో ఉన్న ఫెనోఫిబ్రిక్ యాసిడ్ కోవిడ్ సంక్రమణను తగ్గిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఇది ప్రారంభ క్లినికల్ ట్రయల్స్‌లో కూడా నిరూపితం అయింది.

ఫెనోఫైబరేట్ అంటే..

ఫెనోఫైబరేట్ ఒక మౌఖిక మందు. ఇది రక్తంలో కొలెస్ట్రాల్, లిపిడ్లను నియంత్రించడానికి ఉపయోగిస్తారు. ఈ ఔషధం ప్రపంచవ్యాప్తంగా సులభంగా లభిస్తుంది.  చౌకగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఔ షధ అధికారులు కొలెస్ట్రాల్ ఉన్న రోగులపై ఈ  ఔషధ వినియోగాన్ని ఆమోదించారు.

పరిశోధనలో  5  ముఖ్య విషయాలు

పరిస్థితి క్లిష్టంగా మారకుండా నిరోధిస్తుంది : పరిశోధకురాలు ఎలిజా విసెంజీ మాట్లాడుతూ, పరిశోధనా ఫలితాలు ఫెనోఫైబ్రేట్‌కి కరోనా ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా మారకుండా నిరోధించే సామర్ధ్యం ఉందని తేలింది. ఇది వైరస్ వ్యాప్తి చెందకుండా కూడా సహాయపడుతుంది.

టీకాకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది: పరిశోధకులు, అన్ని క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత, టీకా ఇవ్వలేని వారికి కూడా ఈ ఔషధం ఇవ్వవచ్చు. ఉదాహరణకు.. పిల్లలు, రోగులు హైపర్ రోగనిరోధక రుగ్మతలతో బాధపడుతున్నారు.

కరోనా అసలు జాతిపై చేసిన ప్రయోగం: గత సంవత్సరం ల్యాబ్‌లో కరోనా అసలు జాతి సోకిన కణాలపై ఫెనోఫైబ్రేట్ ఔషధ ప్రభావాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఫలితంగా ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని 70 శాతం తగ్గిస్తుందని కనుగొనబడింది.

ఔషధం ఆల్ఫా-బీటా స్టెయిన్‌పై కూడా ప్రభావవంతంగా ఉంటుంది: అమెరికా, ఇజ్రాయెల్‌లోని ఆసుపత్రులలో చేరిన కరోనా రోగులపై ఈ ఔషధం పరీక్షించబడుతోంది. శాస్త్రవేత్తల ప్రకారం, ఈ ఔషధం ఆల్ఫా, బీటా జాతులపై కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

డెల్టా జాతిపై ప్రభావాన్ని పరిశోధించడం: పరిశోధకుల ప్రకారం, కరోనా డెల్టా జాతి అత్యంత ప్రమాదకరమైనది. ఈ జాతిపై ఫెనోఫైబ్రేట్ అనే మందు ఎంత ప్రభావవంతంగా ఉంటుందనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఫలితాలు త్వరలో విడుదల చేయబడతాయి.

Also Read: కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ మిశ్రమాన్ని కలిపి ఇస్తే మెరుగైన ఫలితాలు.. ఐసీఎంఆర్ స్టడీలో వెల్లడి

CDC Study: వ్యాక్సిన్ తీసుకోకపోతే.. కరోనా రెండోసారి కూడా సోకుతుంది.. సీడీసీ హెచ్చరిక

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!