కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ మిశ్రమాన్ని కలిపి ఇస్తే మెరుగైన ఫలితాలు.. ఐసీఎంఆర్ స్టడీలో వెల్లడి

రెండు వేర్వేరు వ్యాక్సిన్లు..కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకామందుల మిశ్రమాన్ని కలిపి ఇస్తే ఏ విధంగా ఉంటున్నదానిపై అధ్యయనం మొదలైంది. ఇది మెరుగైన ఫలితాలను ఇచ్చినట్టు వెల్లడైందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్.ఐసీఎంఆర్ తెలిపింది.

కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్ మిశ్రమాన్ని కలిపి ఇస్తే మెరుగైన ఫలితాలు.. ఐసీఎంఆర్ స్టడీలో వెల్లడి
Covid Vaccine
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Aug 08, 2021 | 3:36 PM

రెండు వేర్వేరు వ్యాక్సిన్లు..కోవాగ్జిన్, కోవీషీల్డ్ టీకామందుల మిశ్రమాన్ని కలిపి ఇస్తే ఏ విధంగా ఉంటున్నదానిపై అధ్యయనం మొదలైంది. ఇది మెరుగైన ఫలితాలను ఇచ్చినట్టు వెల్లడైందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్.ఐసీఎంఆర్ తెలిపింది. యూపీలో పొరబాటున వేర్వేరు టీకామందులను తీసుకున్న వ్యక్తులపై అధ్యయనాన్ని నిర్వహించగా ఈ మిశ్రమం సురక్షితమైనదే కాక.. నిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడిందని తేలింది. ఈ వ్యాక్సిన్ డోసుల మిశ్రమంపై స్టడీ నిర్వహించాలని డ్రగ్ రెగ్యులేటరీ..డీసీజీఐకి చెందిన నిపుణుల బృందం సిఫారసు చేసింది. ఈ స్టడీ నిర్వహణకు అనుమతించాల్సిందిగా వెల్లూర్ లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ కోరడంతో ఈ సంస్థ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక వ్యక్తికి రెండు వేర్వేరు వ్యాక్సిన్లు ఇస్తే కలిగే ఫలితాన్ని తెలుసుకోవాలని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ సెంట్రల్ ఆర్గనైజేషన్ కి చెందిన నిపుణుల బృందం కూడా ఈ అధ్యయనాన్ని సమర్థించింది.

300 మంది వలంటీర్లపై ఇలా వేర్వేరు వ్యాక్సిన్లను ఇచ్చి వారిపై నాలుగో దశ క్లినికల్ ట్రయల్ నిర్వహించాలని ఈ బృందం వెల్లూర్ లోని మెడికల్ కాలేజీకి సూచించింది. కాగా లోగడ యూపీ లోను, మరికొన్ని రాష్ట్రాల్లో కూడా హెల్త్ కేర్ సిబ్బంది పొరబాటున ఒకే వ్యక్తికి ఈ వేర్వేరు టీకామందులు ఇచ్చిన ఉదంతాలు దేశంలో సంచలనం సృష్టించాయి. ఇలా ఇచ్చినందువల్ల ఆరోగ్య పరమైన ఇతర సైడ్ ఎఫెక్ట్స్ లేదా దుష్పరిణామాలు కలుగుతాయేమోనని ఆందోళన వ్యక్తమైంది. దీనిపై ఆధ్యయనం జరగాలని అప్పుడే పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న దశలో ఈ స్టడీ ఎంతగానో ఉపయోగపడుతుందని వారన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Etela Rajender: మంత్రి హరీశ్ రావుకు ఈటల సవాల్..! వస్తారా.. రండి చూసుకుందామంటూ సవాల్

మమ్మల్ని ఆఫ్ఘనిస్తాన్ కి పంపండి.. ఇండో-టిబెటన్ బార్డర్ ఫోర్స్ సిబ్బంది అభ్యర్థన.. కుదరదన్న ఢిల్లీ హైకోర్టు