మమ్మల్ని ఆఫ్ఘనిస్తాన్ కి పంపండి.. ఇండో-టిబెటన్ బార్డర్ ఫోర్స్ సిబ్బంది అభ్యర్థన.. కుదరదన్న ఢిల్లీ హైకోర్టు

తాలిబన్ల దూకుడుతో ఉద్రిక్త పరిస్థితుల్లో కొనసాగుతున్న ఆఫ్ఘనిస్తాన్ కు తమను పంపాలంటూ ఇండో-టిబెటన్ బార్డర్ ఫోర్స్ కు చెందిన 30 మంది జవాన్లు దాఖలు చేసిన పిటిషన్ ని ఢిల్లీహైకోర్టు తిరస్కరించింది.

మమ్మల్ని ఆఫ్ఘనిస్తాన్ కి పంపండి.. ఇండో-టిబెటన్ బార్డర్ ఫోర్స్ సిబ్బంది అభ్యర్థన.. కుదరదన్న ఢిల్లీ హైకోర్టు
Talibans
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Aug 08, 2021 | 3:37 PM

తాలిబన్ల దూకుడుతో ఉద్రిక్త పరిస్థితుల్లో కొనసాగుతున్న ఆఫ్ఘనిస్తాన్ కు తమను పంపాలంటూ ఇండో-టిబెటన్ బార్డర్ ఫోర్స్ కు చెందిన 30 మంది జవాన్లు దాఖలు చేసిన పిటిషన్ ని ఢిల్లీహైకోర్టు తిరస్కరించింది. మీ అభ్యర్థన వ్యర్థం అని పేర్కొంది. ఆ దేశంలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని, అలాంటిది ఈ తరుణంలో అక్కడికి ఎలా వెళ్తారని ప్రశ్నించింది. అవసరానికి తగినట్టు మీ సేవలను దేశం ఎక్కడైనా ఉపయోగించవచ్చునని…కానీ ఆ దేశంలో నియమించాలనడానికి మీకు హక్కు లేదని న్యాయమూర్తులు రాజీవ్ సహాయ్ ఎండ్ల, అమిత్ బన్సాల్ తో కూడిన బెంచ్ పేర్కొంది. అసలు వీరి కోర్కె పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మొదట ఈ సిబ్బందిని ప్రభుత్వం కాందహార్ లో నియమించింది. అక్కడే రెండేళ్ల పాటు ఉండాలని ఆదేశించింది. ఆ తరువాత కాబూల్ లోని ఇండియన్ ఎంబసీ వద్ద 2020 ఆగస్టులో వీరిని నియమించారు. కానీ అక్కడి నుంచి తిరిగి ఇండియాకు రావాలని ఆదేశించడంతో వీరంతా ఈ ఏడాది జూన్ 13 న మళ్ళీ ఇండియా చేరుకున్నారు. ఆఫ్గనిస్తాన్ లో తాము రెండేళ్లు ఉండాల్సిందని, కానీ 10 నెలలు మాత్రమే ఉన్నామని వీరు తమ పిటిషన్ లో తెలిపారు.

కాబూల్ లోని భారతీయ రాయబార కార్యాలయం వద్ద తమ సేవలు అవసరమన్నారు. కానీ తాలిబన్లు పోరును ఉధృతం చేయడంతో మొదట కాందహార్ లోని మూడు దౌత్య కార్యాలయాలను భారత ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేసింది. అలాగే కాబూల్ లోని ఇండియన్ ఎంబసీ వద్ద కూడా సిబ్బందిని కుదించారు. అలాంటిది ఈ పరిస్థితుల్లో మీరు ఆ దేశానికి ఎలా వెళ్తారని కోర్టు ఈ 30 మంది సిబ్బందిని ప్రశ్నించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలతో కదిలిన సీబీఐ.. జడ్జీలను కించపరచిన అయిదుగురి అరెస్ట్

IND vs ENG 1st Test Live Updates: ఫలితం తేలేది నేడే… మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్.