Etela Rajender: మంత్రి హరీశ్ రావుకు ఈటల సవాల్..! వస్తారా.. రండి చూసుకుందామంటూ సవాల్
"వస్తవా.. రా..! హరీశ్. ఇక్కడ పోటీ చేద్దాం. నా మీద పోటీ చేయ్.." అంటూ ఇవాళ సంచలన ఛాలెంజ్ లకు దిగారు బీజేపీ హుజురాబాద్ నేత ఈటల రాజేందర్. "బక్క పల్చటి పిలగాడు..
Huzurabad Fight: “వస్తవా.. రా..! హరీశ్. ఇక్కడ పోటీ చేద్దాం. నా మీద పోటీ చేయ్..” అంటూ ఇవాళ సంచలన ఛాలెంజ్ లకు దిగారు బీజేపీ హుజురాబాద్ నేత ఈటల రాజేందర్. “బక్క పల్చటి పిలగాడు, దిక్కులేని పిలగాడని నన్ను అనుకుంటున్నావ్? నేను దిక్కులేని వాన్ని కాదు.. హుజురాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డను నేను. పదేసి లక్షలు దళిత బంద్ ఇచ్చినా, గొర్రెలిచ్చినా, కులాలవారిగా తాయిలాలిచ్చినా.. నేనే వాళ్ల గుండెళ్లో ఉన్నారేపు ఎన్నికల్లో చూసుకుందాం..” అంటే ఈటల ఛాలెంజ్ విసిరారు.
“ప్రజల ఓట్లతో వచ్చిన మీ పదవులతో వాళ్లకు ద్రోహం చేస్తే కర్రు కాల్చి వాతపెడతారు. ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు ఐదు వేల కోట్లైనా ఖర్చు చేస్తారట. గతంలో ఏనాడు ఈ నియోజవర్గంలో కనిపించని మంత్రులు ఇప్పుడు ఎందుకు వస్తున్నట్లువాళ్ల ప్రేమంతా మీ ఓట్లపైనే. నన్ను కాపాడుకుంటరా… చంపుకుంటరా మీ ఇష్టం.” అంటూ ఈటల హుజురాబాద్ ప్రజల్ని కోరారు.
“ఎక్కడ దు:ఖం ఉన్నా, ఆపద ఉన్నా అక్కడుండే బిడ్డను నేను. దళితుల ఓట్ల మీద తప్ప.. హుజురాబాద్ దళితులపై కేసీఆర్ పై ప్రేమ లేదు. హైదరాబాద్ ఎన్నికల సమయంలో వరదలొస్తే ఇంటికి పది వేలు ఇస్తానన్న కేసీఆర్.. ఓట్లయ్యాక.. ఆ హామీ నెరవేర్చలేదు.” అంటూ ఈటల చెప్పుకొచ్చారు.
“దమ్ముంటే ప్రలోభాలు బంద్ చేసి, పోలీసులను వెనక్కి రప్పించుకుని నిజాయతీగా ఎన్నికల్లోకి రావాలి. తెల్లబట్టలో పసుపు, బియ్యం పెట్టి ప్రమాణం చేయిస్తారు.. అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఏమిచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేయండి.” అంటూ ఇవాళ నిర్వహించిన హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఈటల ఘాటు వ్యాఖ్యలు సంధించారు.
Read also: Revenue system: తండ్రి, కొడుకు ఆత్మహత్య.. రెవెన్యూ అధికారుల పాపమే అంటోన్న స్థానికులు