Komatireddy: ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు ఇప్పుడే రిజైన్ చేస్తాం.. వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయం. కావాలంటే బాండ్ రాసిస్తాం: కోమటిరెడ్డి

భువనగిరి పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మళ్లీ హాట్ హాట్ కామెంట్స్‌తో ముందుకొచ్చారు. తమ భువనగిరి నియోజవర్గంలో రోడ్లు, సమస్యలు తీర్చి,

Komatireddy: ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు ఇప్పుడే రిజైన్ చేస్తాం.. వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయం. కావాలంటే బాండ్ రాసిస్తాం: కోమటిరెడ్డి
Komatireddy
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 08, 2021 | 2:35 PM

Komatireddy Venkat reddy Challenge: భువనగిరి పార్లమెంట్ సభ్యుడు, తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మళ్లీ హాట్ హాట్ కామెంట్స్‌తో ముందుకొచ్చారు. తమ భువనగిరి నియోజవర్గంలో రోడ్లు, సమస్యలు తీర్చి, అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామంటే ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు ఇప్పుడే రాజీనామా చేస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు.

అంతేనా.. ఏకంగా 2024 ఎన్నికల్లో పోటీ కూడా చేయమని తేల్చి చెప్పేశారు. పైగా.. వీటన్ని శపథాలకు సంబంధించి మీకు డౌటుంటే బాండ్ పేపర్ కూడా రాసి ఇస్తామని కేసీఆర్ సర్కారుకు ఛాలెంజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు 1350 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

చేసిన పనులకు బిల్లులు రాక తెలంగాణలో కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని కోమటిరెడ్డి సర్కారుకు ఈ సందర్భంగా విన్నవించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వ కాంట్రాక్ట్ అంటేనే ఎవరూ ముందుకు రావడం లేదంటూ చెప్పుకొచ్చారు భువనగిరి ఎంపీ. యాదాద్రిజిల్లా చౌటుప్పల్ మండల పరిషత్ సర్వ సభ్య సమావేశంలో  కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Illegal Activities టూరిస్ట్‌ల ముసుగులో వ్యభిచారం.. ఏపీలోని పర్యాటక ప్రదేశాల్లో అసాంఘీక కార్యకలాపాలు.!