AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Illegal Activities టూరిస్ట్‌ల ముసుగులో వ్యభిచారం.. ఏపీలోని పర్యాటక ప్రదేశాల్లో అసాంఘీక కార్యకలాపాలు.!

ఏపీలోని అనేక పర్యాటక ప్రదేశాలు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. సామాన్య ప్రజలు భార్యాపిల్లలతో కలిసి సాయంత్రం వేళ కాసేపు కబుర్లు చెప్పుకునేందుకు వెళ్లే

Illegal Activities టూరిస్ట్‌ల ముసుగులో వ్యభిచారం.. ఏపీలోని పర్యాటక ప్రదేశాల్లో అసాంఘీక కార్యకలాపాలు.!
Tourism
Venkata Narayana
|

Updated on: Aug 07, 2021 | 3:25 PM

Share

Tourists – Illigal Activities: ఏపీలోని అనేక పర్యాటక ప్రదేశాలు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. సామాన్య ప్రజలు భార్యాపిల్లలతో కలిసి సాయంత్రం వేళ కాసేపు కబుర్లు చెప్పుకునేందుకు వెళ్లే పార్కులు, బీచ్ లకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. దానికి కారణం అక్కడికి టూరిస్టుల ముసుగులో వచ్చే యువతీ, యువకులు రాసలీలల్లో మునిగిపోవడమే. ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెళ్లే టూరిస్ట్‌లకు ఈ తరహా పరిస్థితితో బహిరంగ ప్రదేశాలకు వెళ్లలేకపోతున్నారు. ఇక.. టూరిస్ట్‌ల ముసుగులో తెరచాటున రిసార్ట్స్, లాడ్జ్‌లు, హోటల్లో ఏకంగా వ్యభిచారం నిర్వాహిస్తున్నారు.

ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాలను ఇలాంటి కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. జిల్లాలోని మచిలీపట్నం, విజయవాడ, కొండపల్లి ఖిల్లా వంటి ప్రాంతాలను అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారుస్తున్నారు. అటు, మచిలీపట్నం మంగినపూడి బీచ్‌ను వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారు కొందరు. మచిలీపట్నంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి యువతీ, యువకులు నిత్యం బీచ్ సందర్శనకు వచ్చి.. యధేచ్చగా రాసలీలలు కొనసాగిస్తున్నారు.

రిసార్ట్స్, లాడ్జీలలో యువతీ, యువకులు, వివాహేతర సంబంధాలు కొనసాగించే జంటలు, చెడు ప్రవర్తన కలిగిన మహిళలు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా రీసార్ట్స్ లో పర్యాటకులను ఆకర్షించి.. గంటకు రూ.1000 చొప్పున వసూలు చేసి.. రాసలీలలు సాగిస్తున్నారు.

రిసార్ట్స్ నిర్వాకంపై సమాచారం అందుకున్న పోలీసులు.. సిబ్బందితో కలిసి మెరుపుదాడి చేశారు.. దీంతో పోలీసులను చూసి ఖంగుతిన్న జంటలు.. కొందరు తోటల్లోకి పరుగులు తీయగా.. మరికొందరు రూమ్ లలోని బాత్రూమ్ లకు వెళ్లి దాక్కున్నారు. అనుమానాస్పదంగా చిక్కిన 8 జంటలను పోలీసులు స్టేషన్ కు తరలించారు. పట్టుబడ్డ వారిలో కొందరు ప్రముఖులు, మరికొందరు ప్రజాప్రతినిధుల వద్ద పని చేసే వ్యక్తులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Read also: Pulichintala: టీడీపీ నేతలకు పైత్యం తలకు ఎక్కింది.. పులిచింతల కాంట్రాక్ట్ సంస్థను ఫైనల్ చేసింది చంద్రబాబు : సజ్జల