AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weightlifting: భారత్ వెయిట్ లిఫ్టర్లకు షాక్.. ఒలింపిక్స్‌ కమిటీ సంచలన నిర్ణయం..

Paris Olympics - 2024: టోక్యో ఒలింపిక్స్ ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే.. 2024లో జరిగే ప్యారిస్ ఒలింపిక్స్‌పై ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ

Weightlifting: భారత్ వెయిట్ లిఫ్టర్లకు షాక్.. ఒలింపిక్స్‌ కమిటీ సంచలన నిర్ణయం..
Weightlifting
Shaik Madar Saheb
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 09, 2021 | 6:18 PM

Share

Paris Olympics – 2024: టోక్యో ఒలింపిక్స్ ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే.. 2024లో జరిగే ప్యారిస్ ఒలింపిక్స్‌పై ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో వెయిట్ లిఫ్టింగ్‌ క్రీడను నిలిపివేసేలా చర్యలు ప్రారంభించింది. ప్యారీస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics) నుంచి వెయిట్ లిఫ్టింగ్‌ను జాబితా నుంచి తొలగిస్తున్న ప్రతిపాదనపై ఐఓసీ కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఇకపై ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ ఉండబోదని ఐవోసీ ఆదివారం స్పష్టం చేసింది. ఆదివారం జరిగిన సమావేశంలో ఐవోసీ సభ్యులు ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేశారు. దీంతోపాటు బాక్సింగ్‌ను కూడా కుదించాలని ఐవోసీ సభ్యులు తీర్మానించారు.

వెయిట్ లిఫ్టింగ్ అథ్లెట్లకు ప్రమాదకరంగా ఉండటంతో చాలా మంది డోపింగ్‌కు పాల్పడుతున్నట్లు ఐవోసీ సభ్యుల నుంచి అంతకుముందే.. వాదనలు వినిపించాయి. సుదీర్ఘ కాలంగా వెయిట్ లిఫ్టర్లు డ్రగ్స్ వాడుతూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ మేరకు గతంలోనే ఇంటర్నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ (ఐడబ్ల్యూఎఫ్)కు ఐవోసీ హెచ్చరికలు సైతం జారీచేశారు. వెయిట్ లిఫ్టర్లలో ఎక్కువ మంది డోపీలు తేలుతున్నారని.. కావున సంస్కరణలు తీసుకొచ్చేందుకు కమిటీ నడుంబిగించింది.

పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. వెయిట్ లిఫ్టర్లలో మార్పు రాకపోవడంతో.. అనేక ఫిర్యాదులు అందినట్లు సభ్యులు పేర్కొన్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ప్యారీస్ ఒలింపిక్స్ 2024 నుంచి వెయిట్ లిఫ్టింగ్‌ను సస్పెండ్ చేస్తూ ఐవోసి నిర్ణయం తీసుకుంది. ఐడబ్ల్యూఎఫ్ సంస్కరణలు అమలు చేసి డోపీలపై కఠిన చర్యలు తీసుకుంటే.. 2028 లాస్ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో తిరిగి ఈ విషయాన్ని పరిశీలించే అవకాశముందని ఐవోసీ వెల్లడించింది. కాగా.. ఐవోసీ ఎగ్జిక్యూటీవ్ బోర్డుకు పూర్తి నిర్ణయాధికారం ఉండటంతో వెయిట్ లిఫ్టింగ్‌ను సస్పెండ్ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకుంది.

కాగా ఐఓసీ నిర్ణయంపై వెయిట్ లిఫ్టర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయ్ చాను భారత్‌కు తొలి పతకం అందించిన విషయం తెలిసిందే. తన ప్రతిభతో సిల్వర్ మెడల్‌తో భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే వెయిట్ లిఫ్టింగ్ ఐఓసీ తీసుకున్న నిర్ణయంపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Also Read: Niraj Chopra Hair Style: ఒలింపిక్స్ కోసం నీరజ్ తనకిష్టమైన జుట్టునూ త్యాగం చేశాడు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Tokyo Olympics 2021: ఒలింపిక్స్ లో మధుర క్షణాలు..సంబరాల్లో హృదయాన్ని మీటిన సంఘటనలు.. ఫొటోల్లో చూసేయండి!

సింహాన్ని గాల్లో గింగిరాలు కొట్టించిన గేదె.. కొమ్ములతో పొడుస్తూ బీభత్సం.. వైరల్ వీడియో!

అమ్మాయి టిక్‌ టాక్‌ వీడియో చేస్తోంది..! అప్పుడే వాళ్ల అమ్మ వచ్చింది..? ఏం జరిగిందంటే..