- Telugu News Photo Gallery Sports photos Tokyo Olympics 2021 special movements in photos the heart touching movements of Olympics 2021
Tokyo Olympics 2021: ఒలింపిక్స్ లో మధుర క్షణాలు..సంబరాల్లో హృదయాన్ని మీటిన సంఘటనలు.. ఫొటోల్లో చూసేయండి!
విశ్వ క్రీడా సంరంభం ఒలింపిక్స్ 2021 విజయవంతంగా ముగిసింది. ఎందరో క్రీడాకారులు.. తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 33 క్రీడలలో 339 పతకాల కోసం ఆటగాళ్లు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. ఈ ఒలింపిక్స్ లో కొన్ని అద్భుత క్షణాలు.. వాటిలో అత్యంత ప్రధానమైనవి మీకోసం..
Updated on: Aug 08, 2021 | 7:26 PM

మొదటిసారి 49 శాతం మహిళలు: ఒలింపిక్స్ చరిత్రలో మొదటిసారిగా 1900 సంవత్సరంలో మహిళలకు ప్రవేశం కల్పించారు. స్విట్జర్లాండ్‌కి చెందిన హెలెన్ డి పోర్టల్స్ ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్న మొదటి మహిళ. ఇప్పుడు కాలం పరుగులు తీసింది. తొలిసారిగా ఈ సంవత్సరం అంటే 2021 ఒలింపిక్స్ లో 49 శాతం మహిళలు పాల్గొన్నారు.

సమానత్వ హక్కు: ఈ ఒలింపిక్స్‌లో మరో అద్భుత విషయానికి బీజం వేసింది. మొట్టమొదటిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ (మగ నుండి ఆడ)కు ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం కల్పించారు. న్యూజిలాండ్ వెయిట్ లిఫ్టర్ లారెల్ హబ్బర్డ్ ఆటలో ఓడిపోయినప్పటికీ, ఆమె సమానత్వం కోసం ఒక చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయడంలో విజయం సాధించింది.

గేమ్ గెలవడానికి మాత్రమే ఆడలేదు: లారెల్ పతకం కోల్పోయింది కానీ అందరి హృదయాలను గెలుచుకుంది. బంగారు పతకాన్ని పంచుకున్న ఇద్దరు ఫైనలిస్టుల మధ్య ఒక అద్భుతమైన క్రీడాస్ఫూర్తి కనిపించింది. ఖతార్ కు చెందిన ముతాజ్ ఎస్సా బెర్షిమ్, ఇటలీకి చెందిన జియాన్మార్కో తాంబ్రి ఇందుకు కారణం. హై జంప్‌లో ఈ ఇద్దరిమధ్యా టై ఏర్పడింది. దీంతో ఈ ఇద్దరు బంగారు పతకాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకరికొకరు విజయాన్ని పంచుకోవడం ద్వారా, ఈ ఇద్దరు ఆటగాళ్లు పతకాల రేసులో పాల్గొన్న చాలా మంది ఆటగాళ్లను భావోద్వేగానికి గురి చేశారు.

ఆనందం-కన్నీళ్లు: మన దేశపు వ్యాఖ్యాతలు కూడా భావోద్వేగానికి గురయ్యారు. సునీల్ తనేజా, సిద్ధార్థ్ పాండే..సెమీ ఫైనల్స్‌లో భారత హాకీ జట్టు బ్రిటన్‌పై విజయం సాధించిన క్షణంలో భావోద్వేగానికి గురయ్యారు. 49 సంవత్సరాల తర్వాత ఈ విజయం లభించింది. ఈ వ్యాఖ్యాతల సంతోషాన్ని చూసిన ఈ దృశ్యం ఒలింపిక్ 2021 కోసం భిన్నమైన ఆనందాన్ని అందించింది అనడంలో సందేహం లేదు.

ఎంపిక స్వేచ్ఛ: 2021 ఒలింపిక్స్‌లో మహిళల దుస్తుల పై కూడా చాలా చర్చ జరిగింది. జర్మన్ జిమ్నాస్టిక్స్ బృందం మహిళల "లైంగికీకరణ" కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. బికినీ-కట్ లియోటార్డ్‌కు బదులుగా పూర్తి శరీర దుస్తులతో పోటీపడింది. ఒకరి ఇష్టానుసారం దుస్తులు ధరించే స్వేచ్ఛను ప్రోత్సహించిన ఈ చర్య పెద్ద చర్చనీయాంశం కావడమే కాకుండా ప్రత్యేకతను కూడా తెచ్చిపెట్టింది.

ఫాలింగ్, గెట్ అప్....రన్నింగ్: పడిపోవడం సులభం, కానీ తిరిగి లేవడం.. రేసులో వేగంగా పరిగెత్తడం కష్టం. ఆ రేసులో గెలవడం మరింత కష్టం, కానీ నెదర్లాండ్స్‌కు చెందిన 28 ఏళ్ల అథ్లెట్ సిఫాన్ హసన్ అలా చేసింది. వాస్తవానికి, ఆగస్టు 2 న, మహిళల 1500 మీటర్ల రేసులో క్వాలిఫైయింగ్ మ్యాచ్ జరుగుతోంది. ఇంతలో, కెన్యా అథ్లెట్ ట్రాక్ మీద పడిపోవడంతో వెనుకే ఉన్న మరో క్రీడాకారిణి సిఫోన్ కూడా చలించి, పడిపోయింది. కానీ, ఆమె నిలబడి ఒక క్షణం కూడా గడవలేదు. రేసు జరుగుతోంది, ఆమె పరుగు పరుగెత్తింది, మొదట రేసును ముగించిన తర్వాతే ఆమె ఆగింది.