- Telugu News Photo Gallery Tokyo olympics 2020-21 photos Tokyo olympic 2020 bajrang punia waved indian flag in the olympic closing ceremony
Tokyo Olympic 2020: ముగిసిన ఒలింపిక్ సంబురం.. భారత పతాకధారిగా బజరంగ్ పూనియా..!
కోవిడ్ -19 మహమ్మారి మధ్య టోక్యోలో జరిగిన 32 వ ఒలింపిక్ క్రీడలు ఆదివారం ముగిశాయి. ముగింపు వేడుకలో భారత పతాకధారిగా బజరంగ్ పూనియా వ్యహరించారు.
Updated on: Aug 09, 2021 | 4:11 AM

జులై 23 న ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్ ఆదివారంతో ముగిశాయి. టోక్యో ఒలింపిక్స్‌లో ఈసారి భారత అథ్లెట్లు గొప్పగా రాణించారు. 6 ఒలింపిక్ పతకాలు సాధించిన రికార్డును భారత్ బద్దలు కొట్టింది. టోక్యలో స్వర్ణంతో సహా ఏడు పతకాలు సాధించింది. టోక్యో ఒలింపిక్స్ ముగింపు వేడుకలో రెజ్లర్ బజరంగ్ పునియా భారత బృందానికి నాయకత్వం వహించాడు.

టోక్యో ఒలింపిక్ వేడుకల్లో స్టేడియం మొత్తం రంగురంగుల లైట్లతో ఆకట్టుకుంది. టోక్యో ఒలింపిక్స్ చివరి అధ్యాయం స్టేడియంలో బాణాసంచాతో ప్రారంభమైంది. 17 రోజుల కార్యక్రమాలను ఓ వీడియోలో చూపించారు. దీంతోనే ముగింపు వేడుక ప్రారంభమైంది. ముగింపు వేడుకకు ఒలింపిక్ క్రీడలను నడిపించడంలో సహాయపడిన వ్యక్తులకు నిర్వాహకులు తమ కృతజ్ఞతలు తెలిపారు.

ముగింపు కార్యక్రమంలో భారత రెజ్లర్ బజరంగ్ పునియా త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని భారత బృందానికి నాయకత్వం వహించాడు. టోక్యో ఒలింపిక్స్ భారతదేశానికి చారిత్రాత్మకమైనది. బజరంగ్ పునియా కాంస్య పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే.

టోక్యో ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో రెజ్లర్ బజరంగ్ పునియా భారతదేశంలోని త్రివర్ణ పతకంతో పాటు మిగిలిన దేశాలతో కవాతు చేశాడు. టోక్యోలో ఒక స్వర్ణం మాత్రమే కాకుండా, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలను భారత్ గెలుచుకుంది.

టోక్యో ఒలింపిక్స్ ముగింపు వేడుకలో ప్రపంచం ఒక వృత్తంలో కనిపించింది. వేడుకల ప్రధాన సందేశం క్రీడలు ఉజ్వల భవిష్యత్తుకు తలుపులు తెరిచాయి. మొత్తం ఒలింపిక్ క్రీడలు ప్రత్యేక కోవిడ్ ప్రోటోకాల్ కింద జరిగిన సంగతి తెలిసిందే.

టోక్యో ఒలింపిక్ ముగింపు వేడుకలో భారత బృందం. భారత అథ్లెట్లు రవి దహియా, బజరంగ్ పునియాతో సెల్ఫీ తీసుకున్నారు. ఏడు పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన చేశారు అథ్లెట్లు.

తదుపరి ఒలింపిక్ క్రీడలు 2024లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతాయి. ఈ క్రీడలు 26 జులై నుంచి 11 ఆగస్టు 2024 వరకు పారిస్‌లో నిర్వహించాలని ప్రతిపాదించారు. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ప్యారిస్ ఒలింపిక్స్ జెండా ప్రదర్శించారు.




