- Telugu News Photo Gallery Tokyo olympics 2020-21 photos With 7 medals, India records its best ever haul at Tokyo, total details here
Tokyo Olympics 2021: విశ్వక్రీడల్లో భారత త్రివర్ణ పతకానికి పసిడి, రజత, కాంస్య రంగులు అద్దిన క్రీడాకారులు..
Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తన పతకాల సంఖ్యను మెరుగుపరుచుకుంది అంతేకాదు..2012 లండన్ ఒలింపిక్స్ లో భారత్ పతకాలు 6 కాగా ఈసారి ఆ సంఖ్య 7 కి చేరింది. పతకాల సంఖ్య కంటే ఈసారి విశ్వక్రీడలు భారత్ కు ప్రత్యేకంగా నిలిచాయి. హాకీలో మళ్ళీ స్వర్ణయుగం దిశగా అడుగులు పడగా.. గోల్ఫ్ వంటి క్రీడల్లో భారతీయులు మంచి ప్రతిభ కనబరిచారు. ఒలింపిక్స్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన పతకదారులు విజయం వారికే కాదు, దేశానికి కూడా గర్వకారణం.
Updated on: Aug 08, 2021 | 1:24 PM

టోక్యో ఒలింపిక్స్ లో మన దేశానికి మొదటి పతకం వెయిట్ లిఫ్టింగ్ లో వచ్చింది. మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ లో కరణం మల్లీశ్వరి తర్వాత భారత్ కు ఈ ఈవెంట్ పతకం అందించింది

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ తెలుగు తేజం పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించింది. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన రెండో భారతీయ క్రీడాకారిణిగా రికార్డ్ సృష్టించింది.

మహిళా బాక్సర్ లవ్లీనా క్వార్టర్ 69 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకుని తన కాంస్య పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మూడో భారతీయ బాక్సర్‌గా లవ్లీనా నిలిచింది.

భారత దేశానికి నాల్గవ పతకం రెజ్లర్ రవి కుమార్ దహియా అందించాడు. రవి 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో రజత పతకం సాధించాడు. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన రెండో భారతీయ రెజ్లర్‌గా రవి కుమార్ దహియా రికార్డ్ సృష్టించాడు.

ఈసారి టోక్యో ఒలింపిక్స్ భారత హాకీ జట్టుకి వెరీ వెరీ స్పెషల్.. 41 ఏళ్ల తర్వాత హాకీ క్రీడలో భారత్ కు పతకం వచ్చింది. జర్మనీని 5-4 తేడాతో ఓడించి భారత్ కాంస్య పతకం అందుకుంది.

పసిడి కోసం పరుగులు తీసిన రెజ్లర్ బజరంగ్ పూనియా సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయాడు. కాలి నొప్పి ఉన్నా కాంస్య పతకం కోసం జరిగిన పోరులో బజరంగ్ 8-0తో కజకిస్థాన్‌కు చెందిన డి నియాజ్‌బెకోను ఓడించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో భారత్‌కు రెండో పతకం లభించింది.

Neeraj Chopra




