- Telugu News పొలిటికల్ ఫొటోలు Natinal sports authority of India felicitate tokyo olympic 2020 winners at delhi
Olympic winners: టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన క్రీడాకారులకు దేశం జైజేలు.. పతక విజేతలకు కేంద్రం ఘన సన్మానం..చిత్రాలు
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన క్రీడాకారులను కేంద్రం ఘనంగా సన్మానించింది. విజేతలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఘనంగా సత్కరించింది.
Updated on: Aug 09, 2021 | 9:38 PM

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన క్రీడాకారులను కేంద్రం ఘనంగా సన్మానించింది. విజేతలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఘనంగా సత్కరించింది. సోమవారం ఢిల్లీలోని హోటల్ అశోక్‌లో స్వర్ణ విజేత నీరజ్ చోప్రాతో సహా మీరాబాయి చాను, రవికుమార్, పీవీ సింధు, భజరంగ్ పునియా, లవ్లీనా, హాకీ పురుషుల జట్టుకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రులు, అధికారులు క్రీడాకారులు, కోచ్‌లను సన్మానించారు.

ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రా మాట్లాడుతూ.. దేశానికి స్వర్ణపతకం తేవడాన్ని గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. వందశాతం ప్రతిభ కనబరిస్తే ఒలింపిక్స్‌లో మెడలు సాధించడం ఖాయమన్నారు బంగారు పతక విజేత నీరజ్ చోప్రా. కష్టాలే క్రీడాకారులను విన్నర్స్‌గా తీర్చిదిద్దుతాయన్నారు.

సెమీస్‌లో ఓడినప్పటికి అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్న వుమెన్ హాకీ టీమ్‌ను కూడా ఘనంగా సన్మానించారు.

ఒలింపిక్స్‌లో సత్తా చాటిన భారత బృందానికి ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సంబరాలు అంబరాన్ని అంటాయి. బ్యాండ్‌మేళంతో స్వాగతం పలికారు అభిమానులు. మెడల్స్ విజేత మాస్క్‌లు ధరించి ఎయిర్‌పోర్టులో హల్‌చల్ చేశారు.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఏడు పతకాలు లభించాయి. జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు నీరజ్ చోప్రా. హర్యానా హరికేన్ అభిమానులు భారీ ఎత్తున ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు.

టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు గెల్చిన కుస్తీ వీరులు రవిదహియా , భజరంగ్ పూనియా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు.

రవిదహియాకు ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ లభించగా .. భజరంగ్‌కు కాంస్యం దక్కింది. 41 ఏళ్ల తరువాత ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన పురుషుల హాకీ జట్టుకు కూడా ఘనస్వాగతం లభించింది.

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి స్వదేశానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంటూ బాక్సర్ లవ్లీనా బొర్గొహెయిన్ ఈ చిత్రాన్ని ట్విటర్‌లో పంచుకుంది

Neeraj Chopra Felicitation1





























