- Telugu News పొలిటికల్ ఫొటోలు World Lion Day 2021: Amazing Images of Lions Shared by PM Modi, Vice president Venkaiah and Union Minister Pradhan
World Lion Day 2021: అందమైన సింహాల ఫొటోలు షేర్ చేసిన ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. చిత్రాలు..
ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
Updated on: Aug 10, 2021 | 9:13 PM

ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. “సింహం గొప్పది అంతేకాక ధైర్యానికి నిర్వచనం. సింహాలకు నిలయంగా ఉన్నందుకు భారత్ గర్వపడుతోంది. ప్రపంచ సింహ దినోత్సవం రోజు సింహల పరిరక్షణపై మక్కువ ఉన్న ప్రజలందరినీ అభినందిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో సింహాల సంఖ్య పెరుగుతుంది. ఈ సందర్భంగా మోడీ మరిన్ని విషయాలను ప్రస్తావించారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిర్ సింహాలకు సురక్షితమైన ఆవాసాలు ఏర్పాటు చేశానని గుర్తు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. సింహాల సంఖ్య పెరుగుదల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. దీనివల్ల పర్యాటకానికి కూడా ప్రోత్సహం అందిందని ప్రధాని మోదీ తెలిపారు.

ప్రపంచ సింహ దినోత్సవం రోజు సింహల పరిరక్షణపై మక్కువ ఉన్న ప్రజలందరినీ అభినందిస్తున్నాను” అంటూ మోదీ ట్వీట్ చేశారు.

ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియాలో సింహాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని.. ఇందు కోసం కృషి చేస్తున్న ప్రతీ ఒక్కరికి తమ అభినందనలు చెప్పారు.

ఏసియాటిక్ లయన్‌కు ఇండియా నిలయం కావడం చాలా గర్వంగా ఉందని మోడీ పేర్కొన్నారు. సింహాలు చాలా ధైర్యం కలవని ఆయన చెప్పారు.

ప్రతీ ఏడాది అగస్టు 10న ప్రపంచ సింహాల దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా సింహాల సంఖ్యను పెంచడానికి, అవగాహన కల్పించడానికి గాను ఈ రోజును సింహాల దినోత్సవం జరుపుతారు.

2015లో 523 ఉన్న సింహాల సంఖ్య.. 2020 కల్లా 674కు పెరిగింది. గిర్ అటవీ ప్రాంతంలో సింహాల సంచారం కూడా గత ఐదేళ్లలో 22 వేల చదరపు కిలోమీటర్ల నుంచి 30 వేల చదరపు కిలోమీటర్ల పేర పెరిగినట్లు మోడీ చెప్పారు.

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రపంచ సింహాల దినోత్సవం రోజు ఒక ఫొటోను షేర్ చేశారు. సింహాల సంఖ్యను పెంచడానికి మనమంతా కృషి చేయాలని కోరారు.

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా సింహాల ఫొటోలను ట్వీట్ చేశారు. గిర్ సింహాలు గుజరాత్‌కు గర్వకారణమని అన్నారు. గుజరాత్ ప్రభుత్వం ఎన్నోసింహాలను రక్షిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. గత 100 ఏళ్లలో 80 శాతం సింహాలు అంతరించి పోయాయని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.




