Huzurabad By poll: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనతో జోష్.. మంత్రి హరీష్ రావు భారీ బైక్ ర్యాలీ.. చిత్రాలు..
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఇంచార్జ్ హరీష్ రావు నేరుగా రంగంలోకి దిగారు. రేపోమాపో ఎన్నిక నోటిఫికేషన్ వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీలు జోరు పెంచాయి.
Updated on: Aug 11, 2021 | 1:36 PM

హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ప్రకటించిన నేపథ్యంలో పొలిటికల్ హీట్ పెరిగింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఇంచార్జ్ హరీష్ రావు నేరుగా రంగంలోకి దిగారు. రేపోమాపో ఎన్నిక నోటిఫికేషన్ వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీలు జోరు పెంచాయి. ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత తొలిసారి ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గంలో ట్రబుల్ షూటర్ హరీష్‌రావు ఎంట్రీ ఇచ్చారు. ఇన్నాళ్లూ తెరవెను మంత్రాంగం నడిపిన ఆయన.. ఇప్పుడు డైరెక్టుగా ఫీల్డ్‌లోకి దిగారు.

హుజూరాబాద్ నియోజకర్గంలోకి భారీ ర్యాలితో ఎంటర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. మంత్రి గంగుల కమలాకర్ తోపాటు కొప్పుల ఈశ్వర్‌లు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో మంత్రి హరీష్ రావుకు కేడర్ గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికింది. కేసీ క్యాంప్ నుంచి.. జమ్మికుంట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో మంత్రి హరీష్ రావుకు కేడర్ గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికింది. కేసీ క్యాంప్ నుంచి.. జమ్మికుంట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

హుజురాబాద్ చౌరస్తాకు చేరుకున్న మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ముందుగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.

హుజురాబాద్ చౌరస్తాకు చేరుకున్న మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి అంబేద్కర్ విగ్రహనికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
