- Telugu News Photo Gallery Business photos Pmsby scheme invest only 1 rupee and get benefits of two lakh rupees know all about pradhan mantri suraksha bima yojana
PMSBY Scheme: అదిరిపోయే స్కీమ్.. నెలకు రూ.1 డిపాజిట్ చేస్తే రూ.2 లక్షల వరకు పొందవచ్చు.. ఎలాగంటే..!
PMSBY Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. తక్కువ డిపాజిట్లలో ఎక్కువ ఆదాయం పొందే స్కీమ్స్‌ను ప్రవేశపెడుతోంది..
Updated on: Aug 11, 2021 | 3:50 PM

PMSBY Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. తక్కువ డిపాజిట్లలో ఎక్కువ ఆదాయం పొందే స్కీమ్స్‌ను ప్రవేశపెడుతోంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఆర్థిక భద్రత కల్పించే పథకాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీటిల్లో చేరడం వల్ల కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. ఇక కేంద్ర సర్కార్ అందించే ఇలాంటి స్కీమ్స్‌లో ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) ఒకటి.

సురక్ష బీమా యోజన అనేది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్. తక్కువ ప్రీమియం దీని ప్రత్యేకత. ఈ పాలసీ జూన్ 1 నుంచి మే 31 వరకు అందుబాటులో ఉంటుంది. సురక్ష బీమా యోజన పథకంలో చేరిన వారు ఏడాదికి రూ.12 చెల్లిస్తే సరిపోతుంది. అంటే నెలకు రూ.1 ఆదా చేస్తే సరిపోతుంది.

పీఎం సురక్ష బీమా యోజన స్కీమ్ ప్రీమియం డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ నుంచే నేరుగా కట్ అవుతాయి. అందువల్ల మీరు మీ బ్యాంక్ అకౌంట్‌లో రూ.12 ఉండేలా చూసుకోవాలి. అంటే నెలకు రూ.1 బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేసుకున్న సరిపోతుంది. రూ.ఒక్క రూపాయితో ఎవ్వరికీ ఇబ్బంది లేదు.

సురక్ష బీమా యోజన స్కీమ్‌లో ఉన్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే.. వారి కుటుంబాలకు రూ.2 లక్షల వరకు డబ్బులు లభిస్తాయి. అదే పాక్షికంగా అంగ వైకల్యం సంభవిస్తే రూ.1 లక్ష వరకు వస్తాయి. శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.2 లక్షలు లభిస్తాయి. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు ఈ ప్రధాన్ మంత్రి సురక్ష బీమా స్కీమ్‌లో చేరవచ్చు.

మీకు దగ్గరిలో ఉన్న బ్యాంక్‌కు వెళ్లి అంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్రాంచుకు వెళ్లి ప్రధాన్ మంత్రి సురక్ష బీమా స్కీమ్‌లో చేరవచ్చు. ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలి. 70 ఏళ్లు దాటితే ఈ స్కీమ్ వర్తించదు. అలాగే ఎలాంటి డబ్బులు కూడా లభించవు.

ప్రతి సంవత్సరం మే 31కి ముందు ప్రీమియం మొత్తం బ్యాంకు ఖాతా నుంచి ఆటో డిడక్ట్ చేయబడుతుంది. ఒక వేళ ఖాతా మూసివేయబడితే పాలసీ రద్దు అవుతుంది.





























