Godavari – Krishna: ఇవాళ కృష్ణా, గోదావరి బోర్డుల సమన్వయ సమావేశం.. బోర్డు మీటింగ్‌కు తెలంగాణ దూరం..

ఏపీ, తెలంగాణ మధ్య జల యుద్ధం కంటిన్యూ అవుతోంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తి విడుదల చేసిన గెజిట్ పై ఇరు రాష్ట్రాలు పలు అభ్యంతరాలు చెబుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ తీవ్ర నిరసన...

Godavari - Krishna: ఇవాళ కృష్ణా, గోదావరి బోర్డుల సమన్వయ సమావేశం.. బోర్డు మీటింగ్‌కు తెలంగాణ దూరం..
Krmb Grmb
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 09, 2021 | 8:47 AM

ఏపీ, తెలంగాణ మధ్య జల యుద్ధం కంటిన్యూ అవుతోంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తి విడుదల చేసిన గెజిట్ పై ఇరు రాష్ట్రాలు పలు అభ్యంతరాలు చెబుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ తీవ్ర నిరసన తెలియజేస్తోంది. ఇటీవల నిర్వహించిన KRMB, GRMB కోఆర్డినేషన్ మీటింగ్ కు హాజరుకాని తెలంగాణ…. వరుసగా మూడు లేఖాస్త్రాలను సంధించింది. అంతేకాదు, ఇవాళ (సోమవారం) జరిగే పూర్తిస్థాయి బోర్డు మీటింగ్ కు కూడా దూరంగా ఉండాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.

సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఇవాళ ముఖ్యమైన కేసుల విచారణ ఉన్నందున కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ భేటీలకు హాజరుకాలేమని తెలంగాణ స్పష్టంచేసింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ రెండు బోర్డులకు లేఖలు రాసింది. తెలంగాణ లేఖల నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన KRMB, GRMB మీటింగ్స్ ఉంటాయో లేదోనన్న అనుమానాలు నెలకొన్నాయి.

కేంద్ర గెజిట్ అండ్ KRMB, GRMB మీటింగ్స్ పై రెండ్రోజులపాటు సుదీర్ధంగా చర్చించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఇరిగేషన్ ఉన్నతాధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాలను సాధించేందుకు సమగ్ర అజెండా రూపొందించాలని సూచించారు. పోలవరానికి కేంద్ర జల సంఘం అనుమతులు ఇచ్చిన వెంటనే కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల వాటాపై గట్టిగా వాదనలు వినిపించాలని సీఎం కేసీఆర్ మార్గదర్శనం చేశారు.

సీఎం సూచనల మేరకు కృష్ణా, గోదావరి బోర్డుల లేఖలు రాసిన ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్…. అందరికీ ఆమోదమైన మరో రోజున భేటీ నిర్వహిస్తే రాష్ట్ర ఇంజనీర్లు హాజరై, అభిప్రాయాలు చెబుతారని తెలిపారు. అయితే, కేవలం పరిపాలనాపరమైన అంశాలే కాకుండా… నీటి వినియోగానికి సంబంధించిన అంశాలను సైతం అజెండాలో చేర్చాలని కోరారు.

బోర్డుల భేటీ వాయిదా కోరుతోన్న తెలంగాణ… కృష్ణా జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటాపై పోరాడేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా కృష్ణా జలాల్లో నీటి వాటాల నిష్పత్తిని మార్చాలని గట్టిగా కోరుతోంది. కృష్ణా జలాలను చెరి సగం పంచాలని డిమాండ్ చేస్తోంది. అలాగే, ఏపీ చేపడుతోన్న రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ కుడి కాలువ పనులను వెంటనే ఆపాలని, అదే సమయంలో పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమ నీటి తరలింపును అడ్డుకోవాలని తెలంగాణ కోరుతోంది.

KRMB, GRMB బోర్డుల మీటింగ్స్‌కు ఆంధ్రా సుముఖంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ మాత్రం హాజరుకాలేమని స్పష్టంచేయడంతో బోర్డులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో తేలాల్సి ఉంది. అయితే, బోర్డులు, కేంద్రం స్పందించే తీరును బట్టి రియాక్షన్ ఉండేలా కార్యాచరణ రెడీ చేస్తున్నారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. ఇక, మొన్న జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్ కు రాలేమని తెలంగాణ చెప్పినా సమావేశాన్ని కొనసాగించిన కృష్ణా, గోదావరి బోర్డులు… ఇవాళ కూడా అలాగే ముందుకు సాగుతాయా? లేక వెనక్కి తగ్గుతాయోనన్నది ఉత్కంఠ మారింది. ఒకవేళ తెలంగాణ హాజరు తప్పనిసరి అని భావిస్తే మాత్రం సమావేశం వాయిదా పడే అవకాశముంది.

ఇవి కూడా చదవండి: Journalist Murder: గుట్కా మాఫియా చేతిలో జర్నలిస్టు కేశవ దారుణ హత్య.. కర్నూలు జిల్లాలో దారుణం..

Dating App: ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఇచ్చే డీల్స్‌పై భారతీయులు భయపడుతున్నారు.. సర్వేలో తేలిన నమ్మలేని నిజాలు..