Realtor Murder Case: రియల్టర్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్.. అసలు నిజం చెప్పిన గురూజీ శిష్యులు..
హైదరాబాద్ రియల్టర్ విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్యకేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. గురూజీతో పాటు ఉండి మాజీ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుప్తనిధులు, లోహాల కోసం పదేళ్లుగా...
హైదరాబాద్ రియల్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. విజయ్ భాస్కర్ మర్డర్ వెనుక ఇప్పటివరకు గురూజీ త్రిలోక్ నాథ్ మాత్రమే ఉన్నాడని భావించిన పోలీసులకు మరో కీలక విషయం తెలిసింది. గురూజీతోపాటు ఓ మాజీ ఎమ్మెల్యే హస్తం కూడా ఈ హత్య వెనుక ఉన్నట్లు గుర్తించారు.గురూజీ త్రిలోక్ నాథ్, ఓ మాజీ ఎమ్మెల్యే కలిసి గుప్త నిధుల కోసం పదేళ్లుగా అన్వేషిస్తున్నారు. ఈ ఇద్దరితో విజయ్ భాస్కర్ రెడ్డి కూడా జతకలిశాడు. అయితే, గుప్త నిధుల అన్వేషణ విషయంలో విజయ్ భాస్కర్ తో గురూజీకి, మాజీ ఎమ్మెల్యేకి విభేదాలు రావడంతోనే మర్డర్ జరిగినట్లు తెలుస్తోంది. విజయ్ భాస్కర్ తో భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని అనుమానించే చంపేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో ఇద్దరిపై తప్పుడు ప్రచారం చేసినట్లుగా విజయ్‌భాస్కర్‌పై అనుమానం పెంచుకున్నారు ఆ ఇద్దరు. విజయ్‌భాస్కర్‌తో ఇబ్బందులు వస్తాయనే హత్యకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. గురూజీ పేరు బయటకు రాకుండా త్రిలోక్‌నాథ్ అలియాస్ గురూజీ భక్తులు స్కెచ్ వేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
గురూజీ మర్డర్ స్కెచ్ అందుకే..
వ్యాపారాలు, సేవల కోసం గురూజీ తనను రూ. 20 లక్షలు అడిగాడని ఓ మహిళ విజయ్‌భాస్కర్‌రెడ్డితో చెప్పింది. అతను స్పందిస్తూ.. ‘గురూజీ మోసగాడు. మీరు డబ్బులిస్తే తిరిగి రావు.. మోసపోతారు. అతడిని నమ్మొద్ద’ని చెప్పాడు. ఈ మాటలనే ఆ మహిళ గురూజీ వద్ద ప్రస్తావించడంతో అతడు కలవర పడ్డాడు. తన గురించి చెడుగా ప్రచారం చేస్తే.. ప్రతిష్టకు భంగం కలుగుతుందని భావించాడు. తనను ఎవరూ నమ్మరని.. ఆర్థికంగా దెబ్బ తింటామని, విజయ్‌భాస్కర్‌రెడ్డిని అంతమొందిస్తేనే సమస్యకు పరిష్కారమని గురూజీ భావించాడు. తన స్నేహితులను ప్రేరేపించి.. ఓ భారీ స్కెచ్ వేసి విజయ్‌భాస్కర్‌రెడ్డిని హత్య చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
కూపీ లాగుతున్నరు..
కేపీహెచ్‌బీ నుంచి విజయ్‌భాస్కర్‌ను తరలించిన కారు ఆధారంగా.. పోలీసులు కూపీ లాగుతున్నారు. KPHB నుంచి విజయభాస్కర్‌ను తరలించిన కారు ఆధారంగా నలుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు ముందు నుంచి అనుమానిస్తున్నారు. అక్కడి సీసీ టీవీ వీడియోల్లో కనిపించిన దృశ్యాలను ఆదారంగా చేసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. విజయభాస్కర్‌ను హత్య చేసి ORR వద్ద మృత దేహాన్ని కాల్చేసినట్టు నిందితులు ఒప్పు కోవడంతో.. మరిన్ని వివరాలను లాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గురూజీ తన మొబైల్ ఫోన్లన్నీ స్విచ్ఛాఫ్ చేయడంతో పాటు తన స్థావరాల్లో ఎక్కడ ఉండకుండా కొత్త ప్రాంతానికి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ముప్పు తిప్పలు..
కాల్చేసిన స్థలం చూపించినట్లుగా తెలుస్తోంది. అయితే అంతకు ముందు నిందితులు పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టారు. ఇదిలావుంటే గురూజీ ఆచూకి ఇంతవరకు లభించలేదు. గురూజీ త్రిలోక్ నాథ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లో రెండ్రోజులుగా జల్లెడ పడుతున్నా …గురూజీ ఆచూకీ మాత్రం దొరకడం లేదు. అయితే, ప్రతి పౌర్ణమికి కావలి బీచ్ కు వచ్చే అలవాటు ఉందని గుర్తించిన పోలీసులు… అతడిని పట్టుకునేందుకు అక్కడో ఒక టీమ్ ను పెట్టారు.
ఇవి కూడా చదవండి: Journalist Murder: గుట్కా మాఫియా చేతిలో జర్నలిస్టు కేశవ దారుణ హత్య.. కర్నూలు జిల్లాలో దారుణం..