Cyber Crime: రూ. లక్ష పెట్టుబడి పెడితే రోజూ రూ. 5 వేల ఆదాయం.. ఆశపడితే అంతే సంగతులు. వెలుగులోకి మరో సైబర్ మోసం.
Cyber Crime: పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా సైబర్ మోసాలు మాత్రం ఆగడం లేదు. ప్రజల అత్యాశనే పెట్టుబడిగా కోట్ల రూపాయాలను కొల్ల గొడుడుతున్నారు సైబర్ మోసగాళ్లు. రోజుకో...
Cyber Crime: పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా సైబర్ మోసాలు మాత్రం ఆగడం లేదు. ప్రజల అత్యాశనే పెట్టుబడిగా కోట్ల రూపాయాలను కొల్ల గొడుడుతున్నారు సైబర్ మోసగాళ్లు. రోజుకో నయా రకం మోసంతో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఇప్పటి వరకు మ్యాట్రిమోని, ఓఎల్‌ఎక్స్ మోసాలు చూశాం. తాజాగా హైదరాబాద్‌లో మరో కొత్త రకం సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. రూ. లక్ష పెట్టుబడి పెడితే రోజుకు రూ. 5 వేలు ఆదాయం వస్తుంది అంటూ అప్పనంగా కోట్ల రూపాయాలు దోచేశారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన అడబాల శ్రీనివాసరావు, నల్లకుంటకు చెందిన నరాల విజయ్‌కృష్ణ ప్రైవేటు ఉద్యోగులు. వీరికి ఇటీవల నగరంలో ఉంటున్న ఇద్దరు చైనీయులు పరిచయం అయ్యారు. అదనపు ఆదాయం వస్తుందంటూ మాల్ 008 పేరుతో ఓ సంస్థను ప్రారంభించి వారిద్దరినీ డైరెక్టర్లుగా మార్చారు. అనంతరం గూగుల్ ప్లే స్టోర్‌లో మాల్ 008 పేరుతో ఓ యాప్‌ను రూపొందించారు. రూ. లక్ష పెట్టుబడి పెడితే.. ప్రతి రోజూ రూ. 5000 ఆదాయం వస్తుందని ఓ యాడ్ ఇచ్చారు. దీంతో ఇది నిజమేనని నమ్మిన బేగంపేటకు చెందిన ఓ మహిళ లక్షరూపాయాలు పెట్టుబడి పెట్టారు. మొదట్లో కమిషన్ రూపంలో కొంత నగదు జమ కావడంతో పూర్తిగా నమ్మిన సదరు మహిళ.. రూ. 2.5 లక్షల పెట్టుబడి పెట్టారు. తీరా కమిషన్ రావడం ఆగిపోయింది. దీంతో మోసపోయానని తెలసుకున్న సదరు మహిళ.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు ఈ మోసపూరిత యాప్ ద్వారా రూ. 15 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ క్రమంలో శ్రీనివాసరావు, విజయ్ కృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి ఖాతాల్లోని రూ. 19 లక్షలను సీజ్ చేశారు. యాప్‌ను రూపొందించిన సదరు చైనీయులు ఎవరనే కోణంలో విచారణ మొదలు పెట్టారు. అప్పనంగా డబ్బులు వస్తాయని ఆశ పడితే మొదటికే మోసం వస్తుందని తాజాగా ఈ ఘటనతో మరోసారి రుజువైంది.
Also Read: PMUY : ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ కింద గ్యాస్ కనెక్షన్లు..! 5 కోట్ల మంది BPL మహిళలకు అవకాశం..
చౌకైన ఎలక్ట్రిక్ సైకిల్..! ఒక్కసారి చార్జ్ చేస్తే 75 నుంచి 100 కిలోమీటర్లు.. ధర ఎంతంటే..?
AP Rain Alert: మరో అల్పపీడనం.. ఏపీలో విస్తారంగా వర్షాలు.. ఎప్పటినుంచంటే.?