Andhra Pradesh: టీచర్‌ పిలిస్తే వెళ్లిన 4వ తరగతి విద్యార్థిని.. తాకరాని చోట తాకుతూ.. !

స్కూలు నుంచి ఇంటికి వచ్చిన బాలిక దుస్తులపై రక్తం మరకలు ఉండటంతో తల్లి ప్రశ్నించడంతో ఈ దారుణం వెలుగు చూసింది.

Andhra Pradesh: టీచర్‌ పిలిస్తే వెళ్లిన 4వ తరగతి విద్యార్థిని.. తాకరాని చోట తాకుతూ.. !
Government Teacher
Follow us
Fairoz Baig

| Edited By: Balaraju Goud

Updated on: Nov 13, 2024 | 9:33 AM

ప్రకాశంజిల్లాలో ఓ ప్రభుత్వం ఉపాధ్యాయుడు బరితెగించాడు. అభం శుభం తెలియని బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. జిల్లా పరిషత్‌ హైస్కూల్లో 4వ తరగతి చదువుతున్న విద్యార్ధినిపై ఓ టీచర్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు వీరపనేని చెన్నకేశవులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై బాధిత బాలిక స్పష్టంగా స్టేట్‌మెంట్‌ ఇవ్వని కారణంగా కేసు నమోదులో జాప్యం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఎట్టకేలకు బాలిక ఇచ్చిన స్టేట్‌మెంట్‌ మేరకు నిందితుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడైన ఉపాధ్యాయుడు వీరపనేని చెన్నకేశవులను పోలీసులు కోర్టు అదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలు దళితురాలు కావడంతో ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచార నిరోధక చట్టం కేసును నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రకాశంజిల్లాలో సంచలనం సృష్టించిన నాలుగో తరగతి విద్యార్ధినిపై లైంగిక దాడి విషయంలో ఘటన జరిగిన తరువాత నాటకీయ పరిణామాల మధ్య మూడురోజుల తరువాత పోలీసులు కేసు నమోదు చేశారు. వారం రోజుల తరువాత నిందితుడైన ఉపాధ్యాయుడు వీరపనేని చెన్నకేశవులను అరెస్ట్‌ చేశారు.

స్కూలు నుంచి ఇంటికి వచ్చిన బాలిక దుస్తులపై రక్తం మరకలు ఉండటంతో తల్లి ప్రశ్నించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. స్కూల్లో తన స్నేహితురాలు ఓ టీచర్‌ పిలుస్తున్నాడని తీసుకెళ్ళిందని, అక్కడ ఆ టీచర్‌ తనపై లైంగికంగా దాడి చేశాడని తల్లికి చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు కుటుంబసభ్యులు. అనంతరం బాలికను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అయితే డాక్టర్లు బాలికను పరీక్షించిన తరువాత తనపై దాడి జరిగిన సమయంలో ఏం జరిగిందన్నది పోలీసులు విచారిస్తుండగా స్పష్టంగా చెప్పలేకపోయింది. ఈ కారణంగా అదేరోజు పోలీసులు కేసు నమోదు చేయలేదు. బాలిక భయపడుతుందన్న కారణంగా రెండో రోజు కూడా ఆమె స్టేట్‌మెంట్‌ తీసుకున్నా, క్లారిటీ లేదన్న కారణంగా మూడు రోజుల వరకు విచారణ ముందుకు సాగలేదు…

మరోవైపు విద్యార్ధినికి బ్లీడింగ్‌ కావడంతో వారం రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్సకోసం చేరిన విద్యార్ధిని వ్యవహారంలో పోలీసులు ఇంకా క్లారిటీ రాలేదన్న కారణంగా తాత్సారం చేయగా విద్యాశాఖ అధికారులు డిప్యూటీ డిఇఓ చంద్రమౌళి, సర్వశిక్షా అభియాన్‌ అదికారి మాధవి లత విచారణ చేపట్టారు. ఇటు హైస్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్దులను, అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను విద్యాశాఖ అధికారులు విచారించారు.

ఈ సందర్భంగా తన స్కూలు మేట్‌గా ఉన్న తన స్నేహితురాలు టీచర్‌ పిలుస్తున్నాడంటూ తీసుకెళ్ళిందని, అక్కడ టీచర్‌ తన రహస్యాంగాల దగ్గర చెప్పుకోలేని విధంగా వేళ్ళతో గట్టిగా తాకాడని బాలిక విద్యాశాఖ అధికారులకు తెలిపింది. తనపై లైంగికదాడికి పాల్పడ్డ ఉపాధ్యాయుడిని బాలిక గుర్తించింది. దీంతో నిందితుడిగా ఉన్న ఉపాద్యాయుడు వీరపనేని చెన్నకేశవులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే నిందితుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. అయితే బాలిక దళితురాలు కావడంతో అట్రాసిటీతోపాటు అత్యాచార నిరోధక చట్టం ప్రకారం మరో కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో ప్రమాదంలో టీమిండియా ఫ్యూచర్.. ఎందుకంటే?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో ప్రమాదంలో టీమిండియా ఫ్యూచర్.. ఎందుకంటే?
30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడం మంచిది కాదు..! ఎందుకో తెలుసా..?
30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడం మంచిది కాదు..! ఎందుకో తెలుసా..?
మెకానిక్ రాకీ ట్విట్టర్ రివ్యూ..
మెకానిక్ రాకీ ట్విట్టర్ రివ్యూ..
కలకలం రేపుతోన్న జంట హత్యలు.. నరికి ఇంటి ముందు పడేసి..
కలకలం రేపుతోన్న జంట హత్యలు.. నరికి ఇంటి ముందు పడేసి..
తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి హెయిర్‌డై అవసరం లేదు..ఈ మూడు చాలు
తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి హెయిర్‌డై అవసరం లేదు..ఈ మూడు చాలు
హనుమాన్‌ ఆలయంలో మంటలు.. ఊరంతా భయం భయం.. దుష్టశక్తుల పనేనంటూ..!
హనుమాన్‌ ఆలయంలో మంటలు.. ఊరంతా భయం భయం.. దుష్టశక్తుల పనేనంటూ..!
భర్తతో విడాకులు.. రెండో పెళ్లికి ముందే తల్లైన హీరోయిన్..
భర్తతో విడాకులు.. రెండో పెళ్లికి ముందే తల్లైన హీరోయిన్..
ఆ 3 ప్రత్యేక అంశాలే భారత్, గయానాలను కలిపేలా చేస్తున్నాయ్: ప్రధాని
ఆ 3 ప్రత్యేక అంశాలే భారత్, గయానాలను కలిపేలా చేస్తున్నాయ్: ప్రధాని
ఇరు దేశాలను క్రికెట్‌ కలిపింది.. క్రీడాకారులతో ప్రధాని మోదీ..
ఇరు దేశాలను క్రికెట్‌ కలిపింది.. క్రీడాకారులతో ప్రధాని మోదీ..
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.