Viral Post: ఆడవాళ్లకు భరోసాగా ఆటో డ్రైవర్.. ఆ ఒక్క మెసేజ్ వాళ్లకు కొండంత అండ!
అర్థరాత్రి ఆటోలో ప్రయాణిస్తున్న ఒక యువతికి ఊహించని అనుభవం ఎదురైంది. మహిళపై భద్రతపై ఆ డ్రైవర్ అన్న చూపిన చొరవ ఆమెను ఎంతగానో ఆకట్టుంది. ఈ చిన్న సంఘటన బెంగళూరు నగరంలో మహిళల భద్రత పట్ల ఆటో డ్రైవర్లకు ఉన్న బాధ్యతను తెలియజెప్పింది. ఈ అనుభవాన్ని సదురు యువతి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న ఒక యువతి అర్థరాత్రి 12 గంటల సమయంలో ఒక రాపిడో ఆటోను బుక్ చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆ సమయంలో ఆమె ఒక్కతే ఉండడంతో యువతి కాస్తా ఆందోళన చెందింది. కానీ ఆటోలో డ్రైవర్ అన్న రాసిన ఒక కొటేషన్ చూసిన తర్వాత ఆ యువతి అమ్మయ్యా అనుకుంది. ఎందుకంటే ఆ డ్రైవర్ అన్న సీటు వెనకా.. నేను కూడా తండ్రినే, సోదరుడినే, మీ భద్రత మాకు ఎంతో ముఖ్యం. మీరు హాయిగా కూర్చోండి అని రాసి ఉంది. దాని చూసిన వెంటనే ఆమెకు ధైర్యం వచ్చింది. ఈ సరికొత్త అనుభవాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది.
వైరల్ పోస్ట్ ఆమె ఇలా రాసుకొచ్చింది.. రాత్రి 12 గంటల సమయంలో ఆటో ప్రయాణిస్తున్న నాకు.. డ్రైవర్ సీటు వెనక కనిపించిన కొటేషన్స్ ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. అది చదివిన తర్వాత నేను నిజంగా సురక్షితంగా ఉన్నానని అనిపించిందని ఆ మహిళ @littlebengalurustories హ్యాండిల్ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు సుమారు 3.7 లక్షల మందికి పైగా వీక్షించారు.
వీడియో చూడండి..
Yet again proving Bengaluru is safe for women ❤️
A North Indian woman traveling alone in an auto at midnight saw a sticker/quote pasted by the auto driver: ‘I’m a father and brother too. Your safety matters. Sit back comfortably.’
Heartwarming! #Bengaluru #WomenSafety
VC :… pic.twitter.com/c2kma6kebe
— ಸನಾತನ (@sanatan_kannada) December 11, 2025
ఈ వీడియోపై చాలా మంది నెటిజిన్లు స్పందించారు. గత 20 సంవత్సరాలుగా నాకు ఈ నగరం తెలుసు, ఇది అందరికీ అత్యంత సురక్షితమైన నగరం అని ఒక వినియోగదారు అన్నారు, నిజానికి ఇదే బెంగళూరు అసలైన నగరస్పూర్తి అని మరో యూజర్ రాసుకొచ్చాడు. మేడమ్, నన్ను నమ్మండి, మీరు బెంగళూరులో సురక్షితంగా ఉన్నారని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. బెంగళూరు స్థానిక అబ్బాయిలు ఎప్పుడూ మిమ్మల్ని ఆట పట్టించరు. ఎవరైనా అలా చేస్తే.. మీరు దయచేసి వారి ఐడెంటిటీని చెక్ చేయండని పేర్కొన్నాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
