బ్రెడ్ ఆమ్లెట్ రుచికరమైన, త్వరిత అల్పాహారం. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే తెల్ల బ్రెడ్ వాడకం, అధిక నూనె వినియోగం, నిత్యం తీసుకోవడం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. గోధుమ లేదా మల్టీగ్రెయిన్ బ్రెడ్, కూరగాయలు చేర్చి, వారానికి ఒకటి రెండుసార్లు మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అలర్జీ ఉన్నవారు దూరంగా ఉండాలి.