AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నిగనిగలాడే గోల్డెన్ కోబ్రా ఎప్పుడైనా చూసారా.. ఎదురు తిరిగిందో ఇక అంతే మరి..!

విశాఖ యారాడ డాల్ఫిన్ హిల్స్ కొండపై నేవీ క్వార్టర్స్‌లో ఉద్యోగులు నివసిస్తూ ఉన్నారు. నేవీ ఉద్యోగి తన కారును షెడ్డులోంచి తీసే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఓ మెరుపు అతని కంట్లో పడింది. ఒక్కసారిగా అవ్వక్కయ్యాడు.. కాస్త కళ్ళను చేతులతో నలిపి మరోసారి చూశాడు..

Viral Video: నిగనిగలాడే గోల్డెన్ కోబ్రా ఎప్పుడైనా చూసారా.. ఎదురు తిరిగిందో ఇక అంతే మరి..!
Golden Cobra
Maqdood Husain Khaja
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 13, 2024 | 10:58 AM

Share

సృష్టిలో ఎన్నో రకాల జీవరాసులు.. జలచరాలు.. సరీసృపాలు.. కానీ వేటికదే ప్రత్యేకత.. కానీ వాటిలో అత్యంత అరుదైన జీవరాసులు కనిపిస్తే ఆ ఆనందమే వేరు.. అదే జరిగింది విశాఖలో.. పాములు పట్టే విషయంలో నేర్పరి అయిన నాగరాజుకు ఓ ఫోన్ కాల్ వచ్చింది… హుటాహుటిన వెళ్ళాడు.. చూస్తే ఒక్కసారిగా మెరుస్తూ కనిపించింది ఆ పాము… అది కూడా బంగారు వర్ణంలో నిగనిగలాడుతూ హల్ చల్ చేస్తోంది. సాధారణంగా నాగుపాములో చాలా రకాలు ఉంటాయి. శ్వేతనాగు, సాధారణ నాగుపాము, గోధుమ నాగు.. ఇలా కొన్ని జాతులు ఉంటాయి. కానీ.. గోల్డెన్ కోబ్రా అత్యంత అరుదైన జాతి. అది కూడా ఇండియాలో కనిపించడం అరుదు.

విశాఖ యారాడ డాల్ఫిన్ హిల్స్ కొండపై నేవీ క్వార్టర్స్‌లో ఉద్యోగులు నివసిస్తూ ఉన్నారు. నేవీ ఉద్యోగి తన కారును షెడ్డులోంచి తీసే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఓ మెరుపు అతని కంట్లో పడింది. ఒక్కసారిగా అవ్వక్కయ్యాడు.. కాస్త కళ్ళను చేతులతో నలిపి మరోసారి చూశాడు.. అతనికి ఓ పాము కళ్ళ ముందు కనిపించింది. అది కూడా బంగారు వర్ణంలో నిగనిగా లాడుతూ ఉంది. కాస్త ముందుకు వెళ్లబోతే బుసలు కొట్టింది. తల నుంచి తోక వరకు స్వర్ణ రంగులో మెరుస్తూ ఉన్న ఆ పాము.. పడగ కింద కూడా నాగుపాము నామం మెరుస్తూ కనిపించింది. పాము పడగకు ముందు వెనుక బంగారు వర్ణంతో ఆ పాము నిగనిగా లాడిపోతూ ఉంది. దీంతో అత్యంత అరుదైన పాముగా భావించిన ఆ నేవీ అధికారి.. స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించాడు. హుటా హుటేనా అక్కడకు చేరుకున్న నాగరాజు.. చాకచక్యంగా పట్టుకున్నాడు.

వీడియో చూడండి..

అత్యంత అరుదైన పామును చూసి స్నేక్ క్యాచర్ ఆశ్చర్యపోయాడు. దానిని చేతిలో పట్టుకొని తెగ మురిసిపోయాడు స్నేక్ క్యాచర్ నాగరాజు. ‘ విశాఖలో ఐదు నుంచి 6 వేల పాముల వరకు రెస్క్యూ చేశాను. కానీ ఇటువంటి పాములు చాలా అరుదు. విశాఖలో ఎటువంటి పాములు ఎక్కడ కనిపించవు. విదేశాల్లోని ఆఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల్లో మాత్రమే ఉండే ఈ పాములు అత్యంత విషపూరితం. సాధ్యమైనంతవరకు ఇతరుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాయి. తనకు హాని జరుగుతుందని భావిస్తే ఎదురు తిరిగి బుసలు కొడుతుంది. అత్యంత ఆవేశంగా దూసుకెళ్లే పాముల్లో ఇదొకటి.’ అని టీవీ9 తో అన్నాడు నాగరాజు..

King Cobra Snake

King Cobra Snake

కేఫ్ కోబ్రాగా ప్రపంచ ప్రసిద్ధి…

గోల్డెన్ కోబ్రా.. స్వర్ణ నాగుగా పేరుగాంచిన ఈ పాము.. ఎడారి ప్రాంతంలో నివసిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఆఫ్రికాలో ఈ జాతి పాములు ఎక్కువగా కనిపిస్తాయి.. దీని శాస్త్రీయ నామం కేప్ కోబ్రా. పసుపు కోబ్రా అని కూడా పిలుస్తారు, ఇది దక్షిణాఫ్రికా ఎడారి, సెమీ ఎడారి ప్రాంతాలతో నివసించే అత్యంత విషపూరితమైన నాగుపాము జాతి . సులభంగా చెట్లు, పొదలను అధిరోహిస్తుంది. ఆహారం కోసం అత్యంత చాకచక్యంగా దాడి చేస్తుంది. ఈ జాతి పాము అత్యంత వేగవంతంగా కదిలే అప్రమత్తమైన పాము అని అంటున్నారు పాములు పట్టే నేర్పరులు. ఇతర ఆఫ్రికన్ విషపూరిత పాములతో పోలిస్తే ఈ జాతి ప్రశాంతంగా దాని సైలి ఉన్నప్పటికీ.. బెదిరింపులకు గురైతే అత్యంత వేగవంతంగా దాడి చేస్తుంది. బెదురుతూ ఆవాసం నుంచి బయటకు వచ్చినప్పుడు దగ్గరగా బుసలు కొడుతూ పడగ విప్పి.. పైకి లేస్తుంది. తన శత్రువు కదలకుండా ఉంటే.. నెమ్మదిగా అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది.