Anupam Kher: వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్ర పోషించిన ‘విజయ్ 69’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే ఈ స్టార్ యాక్టర్ కు వందల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అయితే ఆయనకు ఇప్పటి వరకు సొంత ఇల్లు కూడా లేదట. ఈ విషయాన్ని స్వయంగా అనుపమ్ ఖేర్ వెల్లడించారు. అంతేకాదు సొంత ఇల్లు లేకపోవడానికి గల కారణాలను కూడా వివరించారు.
అనుపమ్ ఖేర్ ప్రస్తుతం ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నాడు. సొంతంగా ఇల్లు కొనకూడదని ఫిక్సయ్యా… అంటూ రీసెంట్‌గా తన సినిమా ప్రమోషన్లో చెప్పాడు, అందుకే ఇప్పటికీ అద్దె ఇంట్లోనే నివాసముంటున్నామన్నాడు ఈ స్టార్ . ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఆస్తుల పంపకంలో పిల్లల మధ్య గొడవలు రావొచ్చు. అందుకే ఆస్తులు కొనేంతగా డబ్బుని దాచిపెట్టి, దానినే సమంగా పంచితే సరిపోతుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ షాకింగ్ ఆన్సర్ చెప్పాడు అనుపమ్, ఇక ఈ విషయం పక్కకు పెడితే.. ఈయనకు దాదాపు వందల కోట్ల మేర ఆస్తులున్నట్టు బీ టౌన్‌లో ఓ టాక్.
‘నేను సినిమా కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్న టైంలో తనకోసం ఓ ఇల్లు కొనివ్వమని అమ్మ కోరింది. దీంతో సిమ్లాలో ఓ ఇల్లును కొనిచ్చాను. నాన్న ఉన్నప్పుడు మేం అక్కడే ఉండేవాళ్లం. ఆయన చనిపోయిన తర్వాత మేం సిమ్లాలో ఉన్నది తక్కువే. అందుకే ఆమె అక్కడ ఇల్లు కావాలని కోరింది. సింగిల్ బెడ్రూమ్ చాలని చెప్పింది గానీ 8 బెడ్రూమ్స్ ఉన్న ఇంటిని కానుకగా ఇచ్చాను. నా భార్యకు ఇలా ఎందుకు ఇచ్చానో చాలారోజుల తర్వాత అర్థమైంది’ అని అనుపమ్ ఖేర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ నటుడి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అనుపమ్ ఖేర్ లాజిక్, థింకింగ్ చాలా కొత్తగా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

