శరీరంలోని వ్యర్థాలను వడపోసి రక్తాన్ని శుద్ధి చేయడంలో కిడ్నీల పాత్ర కీలకమైనది. వాటి పనితీరు తగ్గితే విషతుల్యమైన వ్యర్థాలు పేరుకుపోతాయి. కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎర్ర ద్రాక్ష, బ్లూబెర్రీలు, ఆపిల్ వంటి పండ్లు సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండ్లలోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కిడ్నీ వాపును తగ్గించి, రాళ్లను నిరోధిస్తాయి.