Andhra Pradesh: మెడ నొప్పి.. డాక్టరమ్మ జీవితాన్నే మార్చేసింది.. ఎలాగో తెలిస్తే మీరు కూడా సక్సెస్ అవుతారు..
మెడ నొప్పి, వెన్ను నొప్పి... ఆ డాక్టర్ జీవితాన్ని మలుపు తిప్పాయి. అవే ఆమెను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాయి. ఎంతో కీర్తి ప్రతిష్టలను సాధించిపెట్టాయి.. ఎలాగో తెలుసుకోవాలంటే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చందన రాజారాం కథ చదవాల్సిందే.. చందన 2012 - 15లో కర్నూలు మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీసియా చేస్తున్న సమయంలో..

మెడ నొప్పి, వెన్ను నొప్పి… ఆ డాక్టర్ జీవితాన్ని మలుపు తిప్పాయి. అవే ఆమెను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాయి. ఎంతో కీర్తి ప్రతిష్టలను సాధించిపెట్టాయి.. ఎలాగో తెలుసుకోవాలంటే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చందన రాజారాం కథ చదవాల్సిందే.. చందన రాజారాం స్వస్థలం నెల్లూరు జిల్లా.. చందన 2011లోని ఎంబిబిఎస్ పూర్తి చేసింది. 2012 – 15లో కర్నూలు మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీసియా చేశారు. ఆ సమయంలో ఆమెకి మెడ నొప్పి – వెన్నునొప్పి బాధించాయి. తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. మనోవేదనకు గురైంది. స్విమ్మింగ్ చేస్తే చాలావరకు కంట్రోల్ అవుతుంది.. నొప్పి తగ్గుతుంది అని కొందరు స్నేహితులు సలహా ఇచ్చారు. వారి సలహా మేరకు మెడికల్ కాలేజీ ఉమెన్స్ హాస్టల్ పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో జాయిన్ అయింది. స్విమ్మింగ్ చేయడం నేర్చుకుంది. ఇక అంతే.. ఆమె వెనుకకు తిరిగి చూడలేదు. కొద్ది రోజులకే వెన్నునొప్పి మెడ నొప్పి మాయం అయ్యాయి. అంతటితో ఆగిపోలేదు.
ప్రొఫెషన్‌లో రాణిస్తూనే ఈత పోటీలలో కూడా పాల్గొంది. అప్పటినుంచి ప్రతిరోజు గంట పాటు పోటీలలో పాల్గొనే విధంగా స్విమ్మింగ్ సాధన చేసింది. క్రమంగా పోటీలలో పాల్గొని నెగ్గింది. స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రోత్సాహంతో ఎక్కడ పోటీలు జరిగితే అక్కడ వరకు వెళ్లింది. ఈ ఏడాది అక్టోబర్లో గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచారు. బంగారు వెండి కాంస్య పథకాలు సాధించారు.
ఈనెల 12న మంగళగిరిలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో ఫ్రీ స్టయిల్ బ్యాక్ స్ట్రోక్ తదితర స్విమ్మింగ్ భాగాలలో ప్రతిభ చాటారు. ఏకంగా నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించి కీర్తి ప్రతిష్టలను అందుకుంటున్నారు. సహచరుల నుంచి అభినందనలు వెల్లువెత్తి శభాష్ అనిపించుకున్నారు. మెడ నొప్పి – వెన్నునొప్పి.. వస్తే దానిని సవాల్ గా తీసుకొని చందన సక్సెస్ సాధించడం ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొంటున్నారు. ఇబ్బంది కలిగినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా పరిష్కారం మార్గాలను చూసుకుని సక్సెస్ సాధించాలని సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




