Andhra: అన్నం తినట్లేదు, ఆగని వాంతులు.. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా మ్యాటర్ తేలింది
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం మోతుగూడెంలోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని అస్వస్థతకు గురైంది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సర్రి లుక్కేయండి ఇక్కడ.

పదహారేళ్ల వయస్సు.. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు, జీవితంపై మరెన్నో కలలు ఉంటాయి. ఇలాంటి సమయంలో అందం, ఆకర్షణ, మెచ్చుకోలుగా చెప్పే కబుర్లు ఇవన్నీ వ్యక్తులపై ఇష్టాన్ని కలిగిస్తాయి. ఇలాంటి భావోద్వేగాలతో మొదలయ్యే స్నేహాలు, ప్రేమలు కొందరి జీవితాలను చిన్నతనంలోనే కష్టాలు, కన్నీళ్ల పాలు చేస్తుంటాయి. ముఖ్యంగా బాలికలు ఇలాంటి విషయాల పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం మోతుగూడెంలోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని అస్వస్థతకు గురైంది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఏడు నెలల గర్భవతిగా తేలింది. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ఈ ఘటనపై బుట్టాయగూడెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. అయితే ఇలాంటి ఘటనల విషయంలో ఆశ్రమ పాఠశాల సిబ్బంది వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది.
సాధారణంగా గర్భం దాల్చిన యువతి శరీరంలో చాలా మార్పులు కనిపిస్తాయి. ఆహారం తీసుకోకపోవడం, వాంతులు లాంటివి కొందరిలో కనిపిస్తాయి. శారీరకంగా పైకి కనిపించే లక్షణాలను సైతం ఆశ్రమ పాఠశాల సిబ్బంది గుర్తించలేకపోయారు. ఘటనపై విచారణ జరిపిన ఐటిడిఏపిఓ రాములు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఏం గంగారత్నం, వార్డెన్ జోగాయమ్మను సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా.. గతంలో ఏలూరులో ఒక మైనార్టీ సంస్థలో ఉంటూ చదువుకుంటున్న యువతి సైతం గర్భందాల్చింది. అపుడే పుట్టిన పసికందును బిల్డింగ్ నుంచి పడవేయటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలిసు విచారణలో అశోక్ నగర్‌లోని ఒక మిషనరీ సంస్థకు చెందిన హాస్టల్ విద్యార్థిని ఘటనకు పాల్పడినట్లు తెలుసుకుని ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోనూ ఇలాంటి ఘటన కలకలం రేపింది. హాస్టల్ విద్యార్థిని తరుచుగా బయటకు తీసుకుని వెళ్తున్న వ్యక్తి అక్కడి తోటలో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో వైరల్ కావడం, ఘటనలో నిందితుడు ఆత్మహత్య చేసుకుని మృత్యువాతపడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అప్పట్లో ప్రభుత్వ హాస్టల్స్‌లో ఉండే పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినా బుట్టాయగూడెంలో ఈ తరహా ఘటన జరగటం పట్ల విద్యార్థి సంఘాలనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చేయండి








