వివాదాస్పద దర్శకుడు రామ్‍గోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. ఏకంగా ఇంటికి వచ్చిన పోలీసులు..!

ఈనెల 19న మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు రాంగోపాల్‌వర్మకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు.

వివాదాస్పద దర్శకుడు రామ్‍గోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. ఏకంగా ఇంటికి వచ్చిన పోలీసులు..!
Rgv
Follow us
Fairoz Baig

| Edited By: Balaraju Goud

Updated on: Nov 13, 2024 | 8:47 AM

ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై పోలీస్‌ కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసే దర్యాప్తు ప్రారంభించారు. నవంబర్‌ 19న మద్దిపాడు పీఎస్‌లో విచారణకు హాజరుకావాలంటూ ప్రకాశంజిల్లా పోలీసులు రాంగోపాల్‌వర్మకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు.

వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రంబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్, నారా బ్రాహ్మణిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం. రామలింగం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటి యాక్ట్‌ కింద రాంగోపాల్‌వర్మపై నవంబర్‌ 10న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వివాదాస్పద దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ రాజకీయాల నేపధ్యంలో రూపొందించిన వ్యూహం సినిమా రిలీజ్‍కు ముందే వివాదాలకు తెరతీసింది. ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికలకు ముందు రూపొందించిన ఈ సినిమా అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్‌ చేస్తూ నిర్మించారు. ఈ వ్యూహం సినిమా విడుదలకు ముందే టీజర్, ట్రైలర్లతోనే రాజకీయ దూమారాన్ని రేపింది. తెలుగుదేశం పార్టీ ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విడుదలను ఆపాలని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ సినిమా సెన్సార్‌ను తొలుత తెలంగాణా హైకోర్టు రద్దు చేసింది. అయితే డివిజన్‌ బెంచ్‌లో వర్మ సవాల్‌ చేయడంతో మరోసారి ఈ సినిమాను రివ్యూ చేసిన సెన్సార్‌బోర్డు యు సర్గిఫికెట్‌ ఇవ్వడంతో సినిమా రిలీజైంది.

దివంగత కాంగ్రెస్‌ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్‌ క్రాష్‌లో చనిపోయిన దగ్గర నుంచి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన పరిణామాలను నాటకీయ ఫక్కీలో రాంగోపాల్‌వర్మ తెరకెక్కించారు. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం, పాదయాత్ర, జగన్‌ జైలుకు వెళ్లడం లాంటి అంశాలను ముడిపెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. 2019 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ సీఎం కావడంతో ఈ సినిమా ముగుస్తోంది.

టోటల్‌గా సినిమాలో వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టకుండా 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టిడిపి, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కుయుక్తులు పన్నితే ఆ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మకంగా వైఎస్‌ జగన్‌ ఎలా సీఎం అయ్యారన్నది సినిమా నేపధ్యంగా చూపించారు. ఇప్పుడు ఈ సినిమాలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌, బ్రాహ్మణిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అలాగే సినిమా ప్రమోషన్లలో భాగంగా సోషల్‌ మీడియా ఎక్స్‌లో రాంగోపాల్‌వర్మ వీరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశంజిల్లా మద్దిపాడు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఎం. రామలింగం మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఈనెల 10న ఫిర్యాదు చేయడంతో వర్మపై ఐటి యాక్ట కింద కేసు నమోదైంది.

దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణకు ఈనెల 19న మద్దిపాడు పిఎస్‌లో హాజరుకావాలంటూ పోలీసులు రాంగోపాల్‌వర్మకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆయన నివాసం వద్ద ఉన్నారు. నోటీసులు తీసుకుంటారా..? విచారణకు హాజరు అవుతారా లేదా అన్నదీ ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
అక్కడి పురాతన గుడిలో సినిమా మొదలు.? రామ్ చరణ్ సెంటిమెంట్ ఆ.!
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
54 ఏళ్ల వయసులో.. హాట్ నటితో ఘాటు ప్రేమాయణం.! నెక్స్ట్ పెళ్లా.?
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
వివాదంలో రామ్‌ చరణ్ అయ్యప్ప ఐక్యవేదిక సీరియస్| రికార్డుల వేటమొదలు
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?