AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చూశారా ఈ చిత్రం.! ఇకపై ఫోన్ చేస్తున్నవారి పేరు మీ స్క్రీన్‌పైనే.. ఫీచర్ అదిరింది కదూ.!

ఇక మరింత అడ్వాన్సుడ్‌గా సాంసంగ్ లాంటి మొబైల్ కంపెనీల ఫోన్లోనే ఇలాంటి కాలర్ ఐడి ఫెసిలిటీస్‌ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. కానీ ఇందులో కూడా 100 శాతం జన్యునిటీ లేదు. రకరకాల ఫోన్ నెంబర్లతో ఫోన్లు చేసి సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఈజీగా మోసాలు చేస్తున్నారు. ట్రూ కాలర్‌లో..

చూశారా ఈ చిత్రం.! ఇకపై ఫోన్ చేస్తున్నవారి పేరు మీ స్క్రీన్‌పైనే.. ఫీచర్ అదిరింది కదూ.!
Trai
Rakesh Reddy Ch
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 13, 2025 | 12:51 PM

Share

మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన కొత్తలో.. ఫోన్ చేసింది ఎవరు అని తెలుసుకోవడం దాదాపుగా అసాధ్యం ఉండేది. ఆ తర్వాత కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. అందులో ప్రధానంగా ట్రూ కాలర్. ఇది ఎక్కువ మంది ఆ నెంబర్‌ను ఏ పేరుతో సేవ్ చేసుకుంటే ఆ పేరు మీకు స్క్రీన్‌లో కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా జియో, ఎయిర్‌టెల్ కూడా ఇన్బిల్ట్ కాలర్ ఐడి అందుబాటులోకి తెచ్చాయి. అది కూడా అవతలి వ్యక్తి ఏ పేరుతో కావాలనుకుంటే ఆ పేరుతో కాలర్ ఐడి డిస్ప్లే అవుతుంది. ఇక మరింత అడ్వాన్సుడ్‌గా సాంసంగ్ లాంటి మొబైల్ కంపెనీల ఫోన్లోనే ఇలాంటి కాలర్ ఐడి ఫెసిలిటీస్‌ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. కానీ ఇందులో కూడా 100 శాతం జన్యునిటీ లేదు. రకరకాల ఫోన్ నెంబర్లతో ఫోన్లు చేసి సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఈజీగా మోసాలు చేస్తున్నారు. ట్రూ కాలర్‌లో పోలీస్ స్టేషన్, ఐపీఎస్ అధికారి, ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ కార్యాలయాలు, డిజిటల్ అరెస్ట్, సిబిఐ, సిఐడి అంటూ రకరకాల పేర్లతో ట్రూ కాలర్‌లో రిజిస్టర్ చేసుకుని కాల్స్ చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రజలు కూడా ట్రూ కాలర్‌లో వెరిఫైడ్ నేమ్ వస్తుండడంతో ఈజీగా నమ్మేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఎంతగా ప్రయత్నం చేస్తున్నా వీటిని కంట్రోల్ చేయడం కష్టంగా మారుతుంది. దీంతో కేంద్ర టెలి కమ్యూనికేషన్ శాఖ కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. సిమ్ కార్డ్ కొన్నప్పుడు ఏ ఆధార్ కార్డు ఇస్తామో.. ఆధార్ కార్డులో ఉన్న పేరు మీకు నెంబర్ బదులుగా స్క్రీన్‌లో డిస్ప్లే అవుతుంది. 2026 మార్చి నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే సాఫ్ట్వేర్‌లో మార్పులు చేసుకోవాలని అన్ని టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. CNAP(కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్) పేరుతో దీన్ని అమలు చేయనుంది. వచ్చే ఏడాది మార్చి తర్వాత ఆటోమేటిక్‌గా ఇది అన్ని మొబైల్స్‌లోనూ అప్డేట్ అవుతుంది. ఎవరు ఫోన్ చేస్తున్నారో.. ఫోన్ నెంబర్ స్థానంలో పేరు కనిపిస్తుంది. దీని ద్వారా సైబర్ క్రైమ్‌ని నియంత్రించడం, మొబైల్ యూజర్లకు మరింత ప్రైవసీని పెంచడం ప్రభుత్వ ఉద్దేశం. ఒకవేళ ఎవరైనా పేర్లు కాకుండా మాకు మొబైల్ నెంబర్ మాత్రమే డిస్ప్లే కావాలనుకునే వాళ్ళు దాన్ని ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ కూడా కేంద్ర ప్రభుత్వం కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..