Gold Rate: పండగ వేళ భలే న్యూస్.. బంగారం ధరలు భారీగా తగ్గనున్నాయ్..!
బంగారం రేట్ల రేస్‌కి బ్రేక్ పడబోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో 8 వారాల తర్వాత భారీ పతన సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్కరోజులోనే 24 క్యారెట్ బంగారం ధర రూ.1.32 లక్షల నుంచి రూ.1.25 లక్షలకు పడిపోయింది. ఈ ధరలు సోమవారం నాటి మార్కెట్‌లో కనిపిస్తాయి.

గోల్డ్ రేట్ రేస్‌కి బిగ్ బ్రేక్ పడబోతున్న సంకేతాలు అందుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో 8వారాల తర్వాత బిగ్ ఫాల్ సిగ్నల్స్ చూపిస్తున్నాయి. ఒక్కరోజులో బంగారం ధరలో 3% క్షీణత కనిపిస్తుంది. లక్షా 32వేల నుంచి లక్షా 25వేలకు పడిపోయింది 10గ్రాముల 24 క్యారెట్ గోల్డ్. వెండి ధర కూడా ఒక్కరోజులో ఏకంగా 8% క్షీణత చూపిస్తుంది. లక్షా 70వేల నుంచి లక్షా 53వేలకు పడిపోయింది కేజీ వెండి ధర. సోమవారం నాటి మార్కెట్లో ఈ ధరలు ప్రభావం ఉండే అవకాశం ఉంది. పండగ వేళ ఇప్పటివరకు బంగారం కొననివారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
8, 9వారాల నుంచి గోల్డ్ మార్కెట్‌లో పెట్టుబడులు కాస్త తగ్గి ఇప్పుడు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ వైపు మళ్లారు. ఇది ఒక కారణమైతే, చైనాపై భరించలేని సుంకాలు విధిస్తామని గళమెత్తిన ట్రంప్.. ఇప్పుడు స్వరాన్ని కాస్త సవరించడం, సామరస్యపూర్వక ధోరణిలో మాట్లాడ్డం ఈ ధరల పతకానికి మరో కారణం. ఇటు అమెరికా-రష్యా మధ్య కూడా కాస్త సఖ్యత పెరగడం, అంతర్జాతీయంగా ఉన్న యుద్ధ ఉద్రిక్తతలు నెమ్మదించడంతో గోల్డ్ రేటు తగ్గక తప్పడం లేదు. గోల్డ్‌ను మించి రేటు పర్సెంట్‌లో దూసుకుపోతున్న వెండి ఒక్కసారిగా 8% పండడం ఊహించిన పరిణామమే అంటున్నారు నిపుణులు. ఇప్పటికీ మార్కెట్‌లో అనిశ్చితే కొనసాగుతోంది. సో.. వెండి బంగారం ధరల్లో మరింత కరెక్షన్ ఉండే చాన్స్ ఉందన్నది మరో వార్నింగ్.
Also Read: పొలానికి వెళ్లిన రైతులకు కనిపించిన వింత జీవి.. ఏంటా అని ఆరా తీయగా.. వామ్మో..




