AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: ఆ పుష్పం పేరు ‘వెలిగే టార్చ్ లైట్..!’

ప్రకృతి సృష్టిలో లెక్కలేనన్ని పుష్పాలు ఉన్నా, కొన్ని మాత్రం అరుదైన అందంతో మంత్రముగ్ధులను చేస్తాయి. అలాంటి ఒక విశేష పుష్పం.. ఫ్లేమింగ్ టార్చ్ ఫ్లవర్. తెలుగులో “వెలిగే టార్చ్ లైట్ పుష్పం”గా పిలిచే ఈ పువ్వు విశాఖ జీవవైవిద్య ఉద్యానవనంలో పూసి అందరినీ ఆకట్టుకుంటోంది.

Vizag: ఆ పుష్పం పేరు 'వెలిగే టార్చ్ లైట్..!'
Flaming Torch Flower
Maqdood Husain Khaja
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 18, 2025 | 6:00 PM

Share

సృష్టిలో అనేక రకాల చెట్లు చేమలు ఉంటాయి.. ఒక్కో చెట్టుకు, ఒక్కో మొక్కకు ఒక్కో ప్రత్యేకత..! మరి పుష్పాల్లోనూ లెక్కలేని రకాలు సృష్టిలో ఉన్నాయి. వాటిలో కొన్ని మనకు తెలుసు.. మరికొన్ని విదేశీ అలంకార పుష్పాలుగా కూడా చూస్తూ ఉంటాం.. మరికొన్ని మన కళ్ళ ముందు కనిపించినా వాటిని పెద్దగా మనం పట్టించుకోము.. కొన్ని పుష్పాలు అయితే కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటాయి. అక్కడికి వెళ్తే గాని వాటి గురించి మనకు తెలియదు. తాజాగా విశాఖలో అరుదైన పుష్పం అందరినీ ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. అదే ఫ్లేమింగ్ టార్చ్ ఫ్లవర్. దాన్నే తెలుగులో వెలిగే టార్చ్ లైట్ పుష్పం అని కూడా పిలుస్తూ ఉంటారు.

వాస్తవానికి.. ఫ్లేమింగ్ టార్చ్ ఫ్లవర్ పూచే మొక్క శాస్త్రీయ నామం బిల్ బెర్జియా పిరమిడాలిస్. దాన్నే ఫుల్ ప్రూఫ్ లవర్ అని కూడా అంటారు. ఇది బ్రోమేలియడ్ జాతికి చెందినది. వెస్టిండీస్ కరేబియన్ దీవుల్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఉత్తర అమెరికా, క్యూబా ప్రాంతాల్లోనూ ఈ జాతి మొక్కలకు పుష్పాలు వికసిస్తూ ఉంటాయి. ఈ పుష్పాలు పెరటి తోటలోనూ ఇళ్లలో అలంకార మొక్కగా ఆయా ప్రాంతాల్లో పెంచుకుంటూ వినియోగిస్తూ ఉంటారు. ఈ మొక్క ఆకులు మందంగా కండగలవిగా ఉంటాయి. పుష్పాలు గులాబీ, నారింజ రంగుల్లో వికసించి అందంగా ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

అందుకే ఆ పేరు..

బిల్ బెర్జియా పిరమిడాలిస్ మొక్కకు పూచే పువ్వులు ఎర్రటి వెలిగే టార్చ్ లైట్ ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి. ప్రకాశించేలా కనిపిస్తాయి. అందుకే ఈ మొక్కకు పూచే పుష్పాలను ఫ్లెమింగ్ టార్చ్ లైట్ అంటారు. బిల్ బిజియాలకు చెందిన స్వీట్స్ బోటనీ శాస్త్రవేత్త.. గుస్తాఫ్ జోహన్ బిల్బర్గ్.. 1722-1844 మధ్యకాలంలో ఈ పేరు పెట్టినట్టు కొన్ని కథనాలు ఉన్నాయి. కరేబియన్ దీవుల్లో తప్ప ఆసియా ఖండంలో కనిపించని ఈ పుష్పం.. ఇప్పుడు విశాఖలోని జీవవైవిద్య ఉద్యానవనంలో కనువిందు చేస్తోంది. రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ రామమూర్తి నిర్వహించే ఈ ఉద్యానవనంలో వందలకొద్దీ ఫల, పుష్ప పెరుగుతూ ఉన్నాయి. ఔషధ మొక్కలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇలా అరుదుగా కనిపించే పూలు కూడా అప్పుడప్పుడు పూస్తూ కనువిందు చేస్తాయి. నిగనిగలాడుతూ ఆకర్షిస్తున్న ఫ్లేమింగ్ టార్చ్ ఫ్లవర్‌ను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు క్యూ కడుతున్నారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.

ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా