Andhra: పొలానికి వెళ్లిన రైతులకు కనిపించిన వింత జీవి.. ఏంటా అని ఆరా తీయగా.. వామ్మో..
అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లెలో వింత జీవి హల్‌చల్ చేసింది. మల్లయ్యకొండ కింద పొలంలో రైతులకు సుత్తి ఆకార తలతో ఉన్న నల్లటి పాము కనిపించడంతో ఆశ్చర్యపోయారు. పరిశీలించిన అటవీ అధికారులు ఇది ‘హెమర్ హెడ్ వర్మ్’ అని తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో వింత పాము హల్‌చల్ చేసింది. మల్లయ్యకొండ కింద పొలం పనులకు వెళ్లిన రైతులకు ఈ చిత్రమైన పాము కనిపించింది. దాని తల వద్ద సుత్తి లాంటి ఆకారం ఉండటంతో.. స్థానికులు ఆశ్చర్యంగా చూశారు. చూడటానికి వానపాము మాదిరిగానే ఉందికానీ… పూర్తిగా నల్లగా ఉంది. దీన్ని హెమర్ హెడ్ వర్మ్ అంటారని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. తల ఆకారం హ్యామర్ (సుత్తి) లాగా వెడల్పుగా ఉంటుంది. అందుకే ‘హెమర్ హెడ్ వర్మ్’ అని పేరు వచ్చింది. రంగు సాధారణంగా నల్లటి లేదా గోధుమ రంగులో ఉంటుంది, మధ్యలో లైట్ స్ట్రైప్ లేదా లైన్ ఉంటుంది. పొడవు సాధారణంగా 20–30 సెం.మీ పెరుగుతాయి, కానీ కొన్ని జాతులు అంతకంటే పెద్దగా కూడా ఉంటాయి.
Also Read: ప్రయాణీకుడికి బస్సులో కనిపించిన పర్సు… ఓపెన్ చేయగా.. ధగధగా మెరుస్తూ
ఇది విషపురుగు. అంటే మనుషుల్ని కాటు వేయదు కానీ, దీని శరీరంలో న్యూరోటాక్సిన్ అనే విషం ఉంటుంది. విషాన్ని మట్టి పురుగులను, వాన పాములను చంపడానికి ఉపయోగిస్తుంది. చేత్తో తాకకూడదు. రెండు ముక్కలైనా సరే.. దీని శరీరంలోని భాగం కూడా మళ్లీ కొత్త పురుగుగా పెరుగుతుందట. ప్రధానంగా ఇది వాన పాముల్ని తింటుంది. వాటి శరీరంపై విషం విడుదల చేసి, చనిపోయిన తర్వాత వాటిని తినేస్తుంది. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది కనపడితే అస్సలు చేత్తో ముట్టుకోవద్దు. ఉప్పు లేదా వినిగర్ చల్లితే చనిపోతుంది. లేదా ప్లాస్టిక్ కవర్లో వేసి సీల్ చేసి డస్ట్‌బిన్‌లో వేయడం మంచిది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




