నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
సుమారు రెండు నెలలు.. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి రాజకీయ పార్టీల ప్రచార హోరు కొనసాగించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. మైకులు, డిజే సౌండ్లతో సాగిన ఎన్నికల ప్రచారం మరికొన్ని గంటల్లోనే ఫుల్ స్టాప్ పడనుంది. ఎల్లుండి జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలో మరో కీలక ఘట్టం ముగియనుంది. దీంతో అన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీస్ అధికారులు చివరి 48 గంటల్లో, పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరించారు.

సుమారు రెండు నెలలు.. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి రాజకీయ పార్టీల ప్రచార హోరు కొనసాగించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. మైకులు, డిజే సౌండ్లతో సాగిన ఎన్నికల ప్రచారం మరికొన్ని గంటల్లోనే ఫుల్ స్టాప్ పడనుంది. ఎల్లుండి జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలో మరో కీలక ఘట్టం ముగియనుంది. దీంతో అన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీస్ అధికారులు చివరి 48 గంటల్లో, పోలింగ్ రోజు చేయాల్సిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరించారు. హింసకు, రీపోలింగ్‌కు తావు ఇవ్వకుండా పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యూహాత్మకమైన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల డీఈవోలను, ఎస్పీలను ఆయన ఆదేశాలు జారీచేశారు.
ఇవాళ సాయంత్రం 6 గంటల నుండి పోల్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి సైలెన్స్ పీరియడ్ అమల్లోకి రానుంది. ఈ సమయంలో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుందని.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎవరూ ఉల్లంఘించకూడదన్నారు. చట్టవిరుద్ధమైన సమావేశాలపై నిషేధం 48 గంటల వ్యవధిలో బహిరంగ సభలను నిర్వహించడంపై సెక్షన్ 144 కింద నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేయబడతాయన్నారు. పోల్ ముగిసే 48 గంటల ముందు లౌడ్ స్పీకర్లను అనుమతించకూడదన్నారు. ఎన్నికల్లో ఎటు వంటి అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా ఉండేందుకై ఆయుధాలు, మందుగుండు సామగ్రి అక్రమ రవాణాను నిరోధించడానికి పోలింగ్‌కు ముందు నుండి రాష్ట్రంలోను, అంతర్ రాష్ట్రాల నుండి వచ్చే లారీలు, వాణిజ్య వాహనాల కదలికలపై గట్టి నిఘా ఉంచడం జరిగిందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో ఓటు ఉన్న ఓటర్లు అనవసరంగా ఇబ్బందులకు గురిచేయకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.
రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
నియోజకవర్గం వెలుపల నుండి ప్రచారం నిమిత్తం తీసుకువచ్చిన ఓటర్లు కాని రాజకీయ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, క్యాంపెయినర్లు అందరూ ప్రచార సమయం ముగిసిన వెంటనే నియోజకవర్గం నుండి వెళ్లిపోవాలని సూచించారు. రాజకీయ పార్టీల రాష్ట్ర ఇన్చార్జిగా ఉన్న ఆఫీస్ బేరర్లు రాష్ట్ర ప్రధాన కార్యాలయంగా ప్రకటించబడిన ప్రదేశంలో మాత్రమే ఉండాలని, తమ పార్టీ కార్యాలయాన్ని దాటి బయటకు వెళ్లకూడదన్నారు. 48 గంటల వ్యవధిలో ఓటర్లు కాని ఇతర వ్యక్తులు స్థానిక లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లు, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు మొదలైన వాటిలో లేరని నిర్ధారించుకోవాలన్నారు. ఆలయ ప్రాంతాల్లోని యాత్రికులకు, పర్యాటక ప్రాంతాల్లోని టూరిస్టులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక అధికారులకు మీనా సూచించారు. పోలింగ్ ఏజెంట్ అదే పోలింగ్ స్టేషన్ నుండి లేదా పొరుగున ఉన్న పోలింగ్ స్టేషన్‌కు చెందిన వ్యక్తి అయి ఉండాలని, ఒకవేళ అందుబాటులో లేకుంటే అదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఓటరు అయ్యేలా చూడాలన్నారు. ప్రతి అభ్యర్థి లేదా ఎన్నికల ఏజెంట్ ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఒక పోలింగ్ ఏజెంట్‌ను, ఇద్దరు రిలీప్ ఏజెంట్‌లను నియమించుకోవచ్చని, అయితే PS లోపల ఒకేసారి ఒక ఏజెంట్ మాత్రమే ఉండాలన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




