ఆర్ కృష్ణయ్యపై రాయితో దాడి.. తీవ్రంగా ఖండించిన బీసీ నేతలు..
ఏర్పేడులో ఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు బీసీ విద్యార్థి సంఘం నాయకులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నల్లరిబ్బన్లతో నిరసనకు దిగారు. ఆర్ కృష్ణయ్యకు వెంటనే వై కేటగిరి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

ఏర్పేడులో ఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు బీసీ విద్యార్థి సంఘం నాయకులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ. హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నల్లరిబ్బన్లతో నిరసనకు దిగారు. ఆర్ కృష్ణయ్యకు వెంటనే వై కేటగిరి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని, దాడి వెనుక కుట్ర పన్నిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమీషన్‌ను డిమాండ్ చేశారు. ఆర్ కృష్ణయ్యపై జరిగిన దాడి బడుగు బలహీన వర్గాలపై జరిగిన దాడి అని చెప్పారు. దాడికి పాల్పడిన వారి పైన చర్యలు తీసుకొని యెడల బీసీ విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఆర్ కృష్ణయ్య శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు సభ వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగుడు పెద్ద రాయితో ఆయనను వెనక నుంచి దాడికి పాల్పడ్డాడు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అదృష్టవశాత్తు రాయి వీపుకు తగలడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు ఆర్ కృష్ణయ్య. జగన్ మరోసారి అధికారంలోకి వస్తారనే భయంతో టీడీపీ వాళ్లు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడేనన్నారు. ప్రజల ఆదరణ చూసి ఓర్వలేక ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెడితే ప్రసక్తే లేదన్నారు ఆర్‌కృష్ణయ్య. రాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.




