AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముగ్గురికి జీవిత ఖైదు విధించిన కోర్టు.. అసలు కథ ఇదే..

ఓ వ్యక్తి వస్త్ర దుకాణంకు సంబంధించిన వాహనానికి డ్రైవర్‎గా పని చేస్తున్నాడు. కంచరపాలెంలో నివాసం ఉండేవాడు. 2013 అక్టోబర్ ఒకటో తేదీన రోజు మాదిరిగానే విధులకు బయలుదేరాడు. దారిలో ముగ్గురు అటకయించారు. ఎందుకో తెలియక కంగుతున్నాడు ఆ వ్యక్తి. డబ్బులు అడిగారు.. తన దగ్గర లేవని చెప్పేసరికి.. అతనిపై ఆ ముగ్గురూ పిడి గుద్దులు గుద్దారు. తీవ్రంగా కొట్టారు.. వదిలేయమని ప్రాధేయపడినా కనికరించలేదు.

ముగ్గురికి జీవిత ఖైదు విధించిన కోర్టు.. అసలు కథ ఇదే..
Life Imprisonment
Maqdood Husain Khaja
| Edited By: Srikar T|

Updated on: May 10, 2024 | 1:01 PM

Share

ఓ వ్యక్తి వస్త్ర దుకాణంకు సంబంధించిన వాహనానికి డ్రైవర్‎గా పని చేస్తున్నాడు. కంచరపాలెంలో నివాసం ఉండేవాడు. 2013 అక్టోబర్ ఒకటో తేదీన రోజు మాదిరిగానే విధులకు బయలుదేరాడు. దారిలో ముగ్గురు అటకయించారు. ఎందుకో తెలియక కంగుతున్నాడు ఆ వ్యక్తి. డబ్బులు అడిగారు.. తన దగ్గర లేవని చెప్పేసరికి.. అతనిపై ఆ ముగ్గురూ పిడి గుద్దులు గుద్దారు. తీవ్రంగా కొట్టారు.. వదిలేయమని ప్రాధేయపడినా కనికరించలేదు. దీంతో ఆ వ్యక్తి ఆసుపత్రిపాలై ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. ముగ్గురుని అరెస్టు చేశారు.. కోర్టు వారికి శిక్ష ఖరారు చేసింది.

పోలీసుల ప్రకటన ప్రకారం.. బండా దేవుడు అనే వ్యక్తి విశాఖ కంచరపాలెం సంజీవయ్య నగర్‎లో కుటుంబంతో నివసించేవాడు. విశాఖలోని వస్తా దుకాణం వాహనానికి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే.. 2013 అక్టోబర్ ఒకటో తేదీన ఇంటి నుంచి విధులకు బయలుదేరాడు. దారి మధ్యలో ముగ్గురు అటకాయించారు. మధు, సోమశేఖర్ రాజు, లింగాల అఖిల్.. దేముడుకు ఆపి డబ్బులు అడిగారు. లేవని చెప్పేసరికి పిడుగుద్దులు గుద్దారు. ముగ్గురు కలిసి తీవ్రంగా కొట్టారు. దీంతో అదే రోజు సాయంత్రం 6 గంటల సమయంలో తీవ్ర కడుపునొప్పి భరించలేక అరుస్తుండటంతో కేజీహెచ్‎లో వైద్యం కోసం చేర్చారు. పోలీసులు వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.

తనపై దాడి జరిగిన విషయాన్ని పోలీసులతో చెప్పాడు దేవుడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దేవుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కంచరపాలెం పోలీసులు సెక్షన్ ఆల్టర్ చేసి.. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కంచరపాలెం పిఎస్‎కు అప్పటి సీఐగా పనిచేసిన పాపారావు.. కేసు విచారణ చేసి చార్జిషీట్‎ను దాఖలు చేశారు. ఆధారాలతో నేరం రుజువు కావడంతో.. ముగ్గురు నిందితులకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. మధు సోమశేఖర్ రాజులకు యావ జీవ కారాగర శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరు లక్ష రూపాయలు చొప్పున జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నిందితులకు శిక్ష పడడంలో ప్రతిభ కనబరిచిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ, కేసు ట్రైన్లో పురోగతి చూపించిన నగర పోలీసులకు సిబ్బందికి సిపి రవిశంకర్ అయ్యనార్ అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..