AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ‘పేదవాడి భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి’.. మంగళగిరి సభలో సీఎం జగన్..

విశ్వసనీయతకు, విలువలకు అర్థం చెప్పింది మీ బిడ్డ అన్నారు సీఎం జగన్. మంగళగిరి ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు పాలనపై విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 59 నెలల కాలంలో 99శాతం అమలు చేసి చూపించామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేశామన్నారు. గతంలో ఇలాంటి పాలన ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. గతంలో అబద్దాలకు రెక్కలుకట్టి రంగురంగుల మేనిఫెస్టో వచ్చేదన్నారు.

CM Jagan: 'పేదవాడి భవిష్యత్తును మార్చే ఎన్నికలు ఇవి'.. మంగళగిరి సభలో సీఎం జగన్..
Cm Jagan
Srikar T
|

Updated on: May 10, 2024 | 11:53 AM

Share

విశ్వసనీయతకు, విలువలకు అర్థం చెప్పింది మీ బిడ్డ అన్నారు సీఎం జగన్. మంగళగిరి ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు పాలనపై విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 59 నెలల కాలంలో 99శాతం అమలు చేసి చూపించామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేశామన్నారు. గతంలో ఇలాంటి పాలన ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. గతంలో అబద్దాలకు రెక్కలుకట్టి రంగురంగుల మేనిఫెస్టో వచ్చేదన్నారు. కానీ ఆ సాంప్రదాయాన్ని రద్దు చేసి మేనిఫెస్టోకు విశ్వసనీయతకు తీసుకొచ్చామన్నారు. విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చామన్నారు. నాడు – నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశామన్నారు. 6వ తరగతి నుంచే డిజిటల్ తరగతులు ఏర్పాటు చేసి బోధన అందిస్తున్నామన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బై లింగ్వల్ ల్యాంగ్వేజితో తెలుగు, ఇంగ్లీష్ తో పాఠాలు ముద్రించి పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశామన్నారు. ఇంగ్లీష్ మీడియంతో పాటు ఐబీ సిలబస్ వరకు వెళ్తామన్నారు. పూర్తి ఫీజురీయంబర్స్ మెంట్ తో 93శాతం మంది విద్యార్థులకు చదువును అందించామన్నారు. ఇంటర్నేషనల్ సిలబస్ తో గొప్ప చదువులు అందిస్తున్నామన్నారు. ఇదంతా గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడిగారు సీఎం జగన్. పేదల భవిష్యత్తు మారాలి, వాళ్ల తలరాతలు మారాలని కాంక్షించారు. జగన్ కు ఓటేస్తే ఇవన్నీ కొనసాగుతాయని, బాబుకు ఓటేస్తే వీటన్నింటికీ ముగింపు అని అన్నారు. వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా 2లక్షల 70వేల కోట్లు నగదు బదిలీ చేశామన్నారు.

రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇస్తున్నామన్నారు. సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చామన్నారు. బాబు హయాంలో ఎప్పుడైనా రైతులకు మంచి జరిగిందా అని అడిగారు. రైతులకోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి తోడుగా నిలిచామన్నారు. వ్యవసాయానికి ఉచితంగా ఉదయంపూటే నాణ్యమైన కరెంట్ అందిస్తున్నామని చెప్పారు. లంచాలు వివక్షలేని పాలనను చేశామన్నారు. వైద్యరంగంలో పెనుమార్పులను తీసుకొచ్చామన్నారు. ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటింటికి వైద్యం అందజేశామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రతి గ్రామంలో ఫైబర్ గ్రిడ్, డిజిటల్ లైబ్రరీలు తీసుకొచ్చామన్నారు. ఫుట్ పాత్ వ్యాపారులకు అండగా నిలిచామన్నారు.

అక్కచెల్లెమ్మలు ఆపదలో ఉంటే దిశా యాప్ తీసుకొచ్చామన్నారు. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలవకుడదని ఆరోగ్య శ్రీని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్, పౌరసరఫరాలు ఇంటికే వచ్చేలా ఒక వ్యవస్థను రూపొందించామని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఇలాంటి ఏ ఒక్కపథకమైనా గుర్తుకొస్తుందా అని అడిగారు. ఇంత విప్లవాత్మక మార్పును కేవలం 58 నెలల కాలంలోనే చేసి చూపించామన్నారు. గతంలో పొదుపుసంఘాల అక్కచెల్లెమ్మలకు రుణమాఫీ చేశారా అని అడిగారు. రైతులకు పూర్తిగా రుణాలు మాఫీ అన్నారు. ఏ ఒక్క రైతుకైనా పూర్తి రుణం మాఫీ అయిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలన మొత్తం అబద్దాలు, మోసాల మయం అని విమర్శించారు. ఈ ఎన్నికలు రాబోయే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని తెలిపారు. ఆలోచించి ఓటు వేయండని ప్రజలను కోరారు. సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, నిధులు మీ ఖాతాల్లోకి జమ చేయాలన్నా ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేయాలని తెలిపారు.

సీఎం జగన్ లైవ్ వీడియో..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..