Watch Video: రైస్ మిల్లులో పోలీసుల తనిఖీలు.. చూసి షాక్ అయిన అధికారులు..

ఎన్నికల వేళ భారీగా గోవా మద్య పట్టుబడింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామంలో అక్రమంగా తరలించి నిలువ ఉంచిన మద్యాన్ని గుర్తించారు పోలీసులు. ఏపీలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఈసీ. ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి అణువణువునా గాలింపు చర్యలు చేపట్టింది. జిల్లా చెక్ పోస్టుల నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ప్రతి అంశంపై ప్రత్యేక నిఘా పెట్టారు.

Watch Video: రైస్ మిల్లులో పోలీసుల తనిఖీలు.. చూసి షాక్ అయిన అధికారులు..
Goa Liquor
Follow us

|

Updated on: May 10, 2024 | 10:39 AM

ఎన్నికల వేళ భారీగా గోవా మద్య పట్టుబడింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామంలో అక్రమంగా తరలించి నిలువ ఉంచిన మద్యాన్ని గుర్తించారు పోలీసులు. ఏపీలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఈసీ. ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి అణువణువునా గాలింపు చర్యలు చేపట్టింది. జిల్లా చెక్ పోస్టుల నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ప్రతి అంశంపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామంలోని రైస్ మిల్లులో పెద్ద ఎత్తున గోవా మద్యాన్ని నిలువ ఉంచినట్లు గుర్తించారు. స్థానికుల సహాయంతో విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే రైస్ మిల్లు వద్దకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు.

రైస్ మిల్లు గోడౌన్ తెరిచి చూసిన పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా షాక్‎కు గురయ్యారు. తిప్పనగుంట రైస్ మిల్లులో 125 కేసుల గోవా మద్యం సీజ్ చేశారు. అందులో ఫుల్ బాటిళ్లతో పాటు క్వార్టర్ బాటిల్స్ కేసులు కూడా ఉన్నాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ. 7 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ మద్యం సీసాలను వీరవల్లి పోలీస్ స్టేషన్‎కు తరలించారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీటిని రైస్ మిల్లులో భద్రపరచడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయ్నతం చేస్తున్నారు. రైసు మిల్లు యాజమాని ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆయనను గుర్తించి విచారించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ బాటిళ్లను ఈ గోడౌన్ లో నిలువ ఉంచారు, ఆ మద్యం సీసా కేసులు ఎవరికి సంబంధించినవి అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఆపరేషన్‎లో పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ… తక్కువ వడ్డీకే రుణాలు
వ్యాపారస్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ… తక్కువ వడ్డీకే రుణాలు
పెరుగుతో బెల్లం కలిపి తింటున్నారా..? ఏమవుతుందో తెలుసా..?
పెరుగుతో బెల్లం కలిపి తింటున్నారా..? ఏమవుతుందో తెలుసా..?
తెలంగాణ ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ సాధించిన అభిమాని.. సమంత పోస్ట్
తెలంగాణ ఎంసెట్‌లో టాప్ ర్యాంక్ సాధించిన అభిమాని.. సమంత పోస్ట్
కీలక నిర్ణయం.. ఉబెర్‌ నుంచి ట్యాక్సీలే కాదు ఇక బస్సులు కూడా..
కీలక నిర్ణయం.. ఉబెర్‌ నుంచి ట్యాక్సీలే కాదు ఇక బస్సులు కూడా..
ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్‌ ప్రమాదం వెనక ఎవరి హస్తం ఉంది?
ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్‌ ప్రమాదం వెనక ఎవరి హస్తం ఉంది?
శ్రీశైలంలో ఉక్కపోత నుంచి ఉపశమనం.. దంచికొట్టిన వర్షం..
శ్రీశైలంలో ఉక్కపోత నుంచి ఉపశమనం.. దంచికొట్టిన వర్షం..
ఆపద వేళ ఆపన్న హస్తం.. ఆ యాప్ ద్వారా అంబులెన్స్ బుకింగ్స్ షురూ
ఆపద వేళ ఆపన్న హస్తం.. ఆ యాప్ ద్వారా అంబులెన్స్ బుకింగ్స్ షురూ
సూపర్ రీచార్జ్‌ ప్లాన్‌ ప్రకటించిన వీఐ..రూ.1కే బోలెడు లాభాలు
సూపర్ రీచార్జ్‌ ప్లాన్‌ ప్రకటించిన వీఐ..రూ.1కే బోలెడు లాభాలు