AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఆ విషయంలో ఎక్కడా రాజీపడొద్దు.. సీఈఓ మీనా కీలక ఆదేశాలు..

ఆంధ్రప్రదేశ్‎లో సార్వత్రిక ఎన్నికలకు కౌంట్‎డౌన్ స్టార్ట్ అయింది. మరొక మూడు రోజుల్లోనే ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 13న జరుగనున్న ఎన్నికలను ప్రశాంతంగా, న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వ్యూహాత్మకంగా, పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల డీఈవో‎లను, ఎస్పీలను ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు.

AP News: ఆ విషయంలో ఎక్కడా రాజీపడొద్దు.. సీఈఓ మీనా కీలక ఆదేశాలు..
Cec Mukesh Kumar Meena
pullarao.mandapaka
| Edited By: |

Updated on: May 10, 2024 | 8:21 AM

Share

ఆంధ్రప్రదేశ్‎లో సార్వత్రిక ఎన్నికలకు కౌంట్‎డౌన్ స్టార్ట్ అయింది. మరొక మూడు రోజుల్లోనే ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 13న జరుగనున్న ఎన్నికలను ప్రశాంతంగా, న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వ్యూహాత్మకంగా, పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల డీఈవో‎లను, ఎస్పీలను ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలసి ఎన్నికల నిర్వహణకు 72 గంటల ముందు చేయాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు విస్తరణ అంశాలను సమీక్షించారు. 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు చివరి ఘట్టం ఆసన్నమైందన్నారు. రానున్న మూడు రోజులు ఎంతో కీలకమైనవని, అన్ని జిల్లాల ఎన్నికల యంత్రాంగం ఎంతో అప్రమ్తతంగా ఉంటూ ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా చూడాలన్నారు. ఓటర్లను ప్రలోభపర్చే కార్యక్రమాలకు తావులేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలింగ్ డే కి ముందు ఇదే చివరి వీడియో కాన్ఫరెన్స్ అని, ఏమన్నా అపరిష్కృత అంశాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలని, ప్రక్క రాష్ట్రాల నుండి వచ్చే ఓటర్లకు పోలింగ్ రోజు కూడా వచ్చేందుకు ఎటువంటి ఆటంకాలు కల్పించవద్దన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు చేయవలసిన ఏర్పాట్లను, అనుసరించాల్సిన విధివిధానాలను ఆయన వివరించారు. ఎన్నికల సిబ్బంది నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఉద్యోగులందరూ వారికి అప్పగించిన విధులకు తప్పకుండా హాజరయ్యేలా చూడాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలన్నీ వెబ్ కాస్టింగ్ ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల నుండి పర్యవేక్షించాలన్నారు. షాడో ఏరియాలో పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్ నుండి దూరంగా ఉన్న గ్రామస్తులను తరలించేందుకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.

కొన్ని ప్రాంతాలలో హెలికాప్టర్‎లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని సక్రమంగా వినియోగించుకుంటూ పోలింగ్ శాతాన్ని పెంచాలన్నారు. ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లు అందరికీ సకాలంలో ఓటర్ స్లిప్స్ అందేలా చూడాలన్నారు. ఈవీఎంలను తరలించే వాహనాలను జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా వాటి కదలికలను గమనించాలన్నారు. బెల్ ఇంజనీర్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈవీఎంల నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తగా తీసుకోవాలన్నారు. 48 గంటల ముందు అంటే 11 తేదీ సాయంత్రం 6 గంటలకు డ్రైడే ప్రారంభమవుతుందని.. డ్రై డేను పటిష్టంగా అమలుపరచాలన్నారు. పోలింగ్ రోజున ఓటర్లు ఏమాత్రం ఎండబారిన పడకుండా క్యూలైన్‎లు అన్ని షామియాలతో కవర్ చేయాలన్నారు. తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కూర్చునేందుకు బెంచీలు, ప్రథమ చికిత్స సేవలు అందుబాటులో ఉంచాలన్నారు.

ఇవి కూడా చదవండి

శాంతి భద్రత విషయంలో డీజీపీ ఆదేశాలు..

డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, బందోబస్తు విస్తరణ ప్రణాళికలను పటిష్టంగా అమలుపరచాలన్నారు. పటిష్టమైన ప్రణాళికలు రూపొందించడం ఒక ఎత్తు అయితే, వాటిని క్షేత్ర స్థాయిలో విజయవంతంగా అమలు పర్చడం మరో పెద్ద టాస్క్ అన్నారు. అమల్లో ఏమాత్రం తేడా వచ్చిన ఊహించిన ఫలితాలు రావన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సూక్ష్మప్రణాళిలను రూపొందించుకుని అమలు పర్చడమే కాకుండా, సమస్యలపై సకాలంలో స్పందిస్తూ, సరైన చర్యలు చేపడితే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. అనకాపల్లి, కృష్ణా, పల్నాడు, చిత్తూరు జిల్లాలో పలు అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకున్నాయని, భవిష్యత్తులో అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సూక్ష్మ ప్రణాళికలను అమలు చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ సరిహద్దు గల జిల్లాలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ రోజు వాహనాలు, వ్యక్తుల రాకపోకలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గత ఎన్నికల్లో గిరిజన ప్రాంతాలతో పాటు పలుచోట్ల చీకటి పడే వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగిందని, అటువంటి పరిస్థితులు ఈ ఎన్నికల్లో పునరావృతం కాకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల