AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumari aunty: గుడివాడలో కుమారి ఆంటీ ప్రచారం.. ఆ అభ్యర్థికి ఓటు వేయాలని పిలుపు

తన స్వస్థలమైన పెద్ద ఎరుకపాడులో ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉందని.. ప్రజలందరి మంచి కోసమే తాను ప్రచారానికి వచ్చానన్నారు కుమారి ఆంటీ. కుమారి ఆంటీ సొంత ఊరు గుడివాడ కాగా.. హైదరాబాద్‌కు ఉపాధి కోసం వచ్చారు. నగరంలో ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు.

Kumari aunty: గుడివాడలో కుమారి ఆంటీ ప్రచారం.. ఆ అభ్యర్థికి ఓటు వేయాలని పిలుపు
Kumari Aunty
Ram Naramaneni
|

Updated on: May 10, 2024 | 10:56 AM

Share

ఏపీలో ఎన్నికల ప్రచారం పీక్‌కి చేరింది. మరికొన్ని గంటల్లో పోలింగ్ ఉండటంతో.. అన్ని పార్టీల అభ్యర్థులు అస్త్ర శస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ, టీవీ నటులతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సైతం పలు పార్టీల అభ్యర్థల తరుఫున ప్రచారం చేస్తున్నారు. అనుకోని విధంగా ఇప్పుడు కుమారీ ఆంటీ సీన్‌లోకి వచ్చారు. హైదరాబాద్‌లో ఫుడ్ స్టాల్ నిర్వహించే కుమారీ ఆంటో సోషల్ మీడియాలో చాలా ఫేమస్. అప్పట్లో ఆమె స్టాల్‌ను పోలీసులు క్లోజ్ చేయించడంతో వ్యవహారం.. రేవంత్ రెడ్డి వరకూ వెళ్లింది. సీఎంఓ ఆదేశాలతో ఆమె యధావిదిగా మళ్లీ ఫుడ్ స్టాల్ నిర్వహిస్తోంది. అయితే కుమారీ ఆంటీ చుట్టూ అప్పట్లో రాజకీయాలు కూడా నడిచాయి. తాను ఇప్పటివరకు టీడీపీకి ఓటేశానని ఆమె ఓ సారి వ్యాఖ్యానించారు. మరోసారి.. తనకు జగన్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చిందని అన్న వీడియో వైరల్ అయింది.

తాజాగా ఏపీ ఎన్నికల వేళ కుమారి ఆంటీ మరోసారి జనాల్లోకి వచ్చారు. ఆమె సొంత ఊరు గుడివాడ.. సో.. అక్కడ  టీడీపీ అభ్యర్థి తరఫున ఆమె ప్రచారం చేయడం విశేషం. గుడివాడలో టీడీపీ నుంచి బరిలో ఉన్న కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాముకు కుమారి ఆంటీ సపోర్ట్ చేస్తున్నారు. గుడివాడలోని 21, 24,25, 31, 32 వార్డుల్లో ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. వెనిగండ్ల రాముపై కుమారి ఆంటీ ప్రశంసలు గుప్పించారు. ఆయన మహర్షి సినిమాలో మహేష్‌బాబులా మంచి మనసున్న వ్యక్తి అని పేర్కొన్నారు. ఆ మూవీలో మహేష్‌బాబు ప్రజల కోసం సేవ చేస్తే.. గుడివాడలో రియల్‌గా వెనిగండ్ల రాము ప్రజలకు సర్వీస్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. గుడివాడ 15 ఏళ్ల క్రితం అభివృద్ధి లేకుండా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందన్నారు కుమారి ఆంటీ. వెనిగండ్ల రాము గెలిస్తే గుడివాడ డెవలప్‌మెంట్ జరుగుతుందని చెప్పారు. గుడివాడలో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవంతో తనలాంటి వారు పక్క రాష్ట్రాలకు వెళ్లి కష్టపడాల్సి వస్తుందన్నారు. గుడివాడలో వెనిగండ్ల రామును, మచిలీపట్నంలో జనసేన ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వల్లభనేని బాలశౌరిని గెలిపించాలని, ఎన్డీఏకు అందరూ మద్దతు తెలపాలని కుమారీ ఆంటీ కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..