AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR District: అయ్యో..! ఎంతటి విషాదం.. అక్షయ తృతీయ రోజే మహిళ ఉసురు తీసిన బంగారం

ఈ ఏడాది మే 10, శుక్రవారం అక్షయ తృతీయ వచ్చింది. లక్ష్మీ దేవత ప్రసన్నం కోసం అక్షయ తృతీయ పండుగ రోజున బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఈ రోజు జ్యులరీ షాపుల్లో మహిళలు కిటకిటలాడుతుంటారు. ఇలా చేయడం వల్ల సిరి సంపదలు, శ్రేయస్సు పెరుగుతాయని అంటారు. అయితే అక్షయ తృతీయ రోజున ఓ మహిళ తాను ధరించిన బంగారం కారణంగా మరణించింది.

NTR District: అయ్యో..! ఎంతటి విషాదం.. అక్షయ తృతీయ రోజే మహిళ ఉసురు తీసిన బంగారం
Gold Chain
Ram Naramaneni
|

Updated on: May 10, 2024 | 12:56 PM

Share

మే 10, శుక్రవారం… అక్షయ తృతీయ. వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చే తదియను ‘అక్షయ తృతీయ అంటారు.  భారతంలో ధర్మరాజు సూర్య భగవానుడ్ని ఆరాధించి..  అక్షయ పాత్రను పొందిన రోజు ఇదేననీ.. అందువల్ల అక్షయ తృతీయగా పేరొచ్చిందనేది కొందరు చెబుతుంటారు. శ్రీకృష్ణడ్ని దర్శించి కుచేలుడు అపారమైన సంపదలు పొందినదీ ఈరోజునే అంటారు. ఇక పవిత్ర గంగానది దివి నుంచి భువికి దిగివచ్చిన రోజు కూడా ఇదేనన్నది మరికొందరి నమ్మకం. ఒక ఉసిరి కాయను భిక్షగా వేసిన పేద మహిళ.. గుణానికి ముగ్ధుడైన జగద్గురువు ఆదిశంకరులు అమ్మవారిని ప్రార్ధించి.. ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వాన కురిపించింది కూడా ఈనాడే అని చెబుతుంటారు. అందుకే ‘అక్షయ తృతీయ’ వచ్చిందంటే చాలు.. పసిడి ధర ఎంత ఉన్నా కనీసం గ్రాము బంగారమైనా కొంటారు మహిళలు. తద్వారా ఆ సంవత్సరమంతా ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని వారి విశ్వాసం.

అయితే అక్షయ తృతీయ రోజునే.. ధరించిన బంగారం ఓ మహిళ ప్రాణం తీసింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట శివాలయం వద్ద బంగారం కోసం మహిళను హతమార్చారు దుండగులు. కస్తూరి అనే మహిళను హత్య చేసి.. ఆమె ధరించిన 30 గ్రాముల బంగారం చోరీ చేశారు. కస్తూరి భర్త జగ్గయ్యపేటలో ఓ దుకాణంలో గుమ్మస్తాగా పనిచేస్తున్నాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కస్తూరిపై దాడి చేసి మెడలోని గోల్డ్ చైన్, చెవి దిద్దులు అపహరించారు దుండగులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..