Telangana: నేటి నుంచే మద్యం షాపులు బంద్.. ఎప్పటివరకు అంటే…?
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మందుబాబులకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పోలింగ్ నేపథ్యంలో మూడ్రోజుల పాటు వైన్ షాపులు మూసివేయాలని ఆదేశించింది. అలాగే ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4 కూడా మద్యం షాపులు మూసివేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.
మండిపోతున్న ఎండల్లో కూల్ బీర్‌తో చిల్ అవ్వాలనుకుంటున్న మందుబాబులకు అలెర్ట్. తెలంగాణలో 2 రోజులు లిక్కర్ షాపులు, బార్లు క్లోజ్ అవ్వనున్నాయి. తెలంగాణలో మే 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయం సంఘటనలు జరగకుండా.. వైన్ షాపులు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. మే 13న పోలింగ్ జరగనుండగా ముందు నుంచే షాపులు బంద్ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల పాటు మద్యం షాపులతో పాటు అన్ని కల్లు కంపౌండ్‌లను సైతం బంద్ అవ్వనున్నాయి. .
మే 11వ తేదీన అంటే… శనివారం సాయంత్రం 6 నుంచి గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులను బంద్ చేయనున్నారు. తిరిగి మే 13వ తేదీన, పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం 6 గంటలకు షాపులు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. కాగా.. ఓట్ల కౌంటింగ్ రోజైన జూన్ 4న కూడా వైన్ షాపులు మూత పడనున్నాయి. ఎన్నికల వేళ మద్యం అక్రమ రవాణా జరిగే అవకాశం ఉండటంతో.. ఎక్సైజ్ పోలీసులు నిఘా పెంచారు. ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వ చేసినా, అమ్ముతున్నా తమకు సమాచారం ఇవ్వాలన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…